Begin typing your search above and press return to search.

`లైగ‌ర్` పై మైక్ టైసన్ హై ప‌వ‌ర్ పంచ్ లు

By:  Tupaki Desk   |   8 Oct 2021 5:30 AM GMT
`లైగ‌ర్` పై మైక్ టైసన్ హై ప‌వ‌ర్ పంచ్ లు
X
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో ఈ చిత్రం ర‌క్తి క‌ట్టించే స్క్రీన్ ప్లేతో తెర‌కెక్కుతోంది.

ఇందులో మైకేల్ జాక్స‌న్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌డం ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారింది. మాజీ బాక్సింగ్ దిగ్గ‌జం టైస‌న్ పిడిగుద్దులు అంటే త‌న‌కు చాలా భ‌యం అని దేవ‌ర‌కొండ అన్నారు. అత‌డిపై బ్యాడ్ ప్రొప‌గండా ఉన్నా కానీ.. వృత్తిగ‌తంగా అత‌డు అరివీర భ‌యంకరుడిగా నాకు తెలుసు. చిన్న‌ప్ప‌టి నుంచి అత‌డి ఆట తీరును చూశాను అని దేవ‌ర‌కొండ తెలిపారు.

బాక్సింగ్ ఐకాన్ భారతీయ చిత్రంలో నటించడం ఇదే మొదటిసారి అనుకుంటే అది కూడా దేవ‌రకొండ సినిమాలో క‌నిపిస్తుండ‌డం మ‌రో స‌ర్ ప్రైజ్ అనే చెప్పాలి. మైక్ టైస‌న్ కి చెడ్డవాడు అన్న పేరు ఉన్నా కానీ.. అత‌డు ఇటీవ‌ల మారిన మ‌నిషిగా క‌నిపించార‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు. నాకు బాక్సింగ్ కూడా తెలియకముందే నాకు మైక్ తెలుసు. అతను ఇప్పుడు మారిన వ్యక్తి. ఆయన చెప్పిన కొన్ని విషయాలు నన్ను నిజంగా చాలా బాధించాయి... అని తెలిపారు.

అత‌డి పంచ్ లు ఏవీ త‌న‌కు కనెక్ట‌వ్వ‌కుండా చాలా జాగ్రత్తప‌డ్డాను అని తెలిపారు. మైక్ టైసన్ తన అత్యున్నత దశలో ఉన్నప్పుడు అత్యంత భయంకరమైన .. దారుణమైన శక్తివంతమైన బాక్సర్ లలో ఒకడు. అతని పంచ్ త‌గిలిందంటే అంతే సంగ‌తి. అందుకే దేవ‌ర‌కొండ భ‌య‌ప‌డ్డార‌ట‌. మైక్ టైసన్ తో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేటప్పుడు విజయ్ కూడా దెబ్బలు తినేస్తాన‌ని భ‌య‌ప‌డ్డాడ‌ట‌. ఈ చిత్రంలో అనన్య పాండే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.