Begin typing your search above and press return to search.

చూడముచ్చటగా మిహీక బజాజ్ హల్దీ వేడుకలు..!!

By:  Tupaki Desk   |   6 Aug 2020 3:02 PM GMT
చూడముచ్చటగా మిహీక బజాజ్ హల్దీ వేడుకలు..!!
X
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కాబోయే భార్య మిహీకా బజాజ్.. రెండు కుటుంబాల మధ్య ఈరోజు జరిగిన హల్దీ వేడుక నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వేడుక ఏమిటో అని పెద్దగా ఆలోచించే అవసరం లేదు. సెలెబ్రిటీలకు స్టైలిస్ట్ అయిన మిహీక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బిజీగా ఉందని ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది. ఇటీవలే వధువు ఇంట్లో ‘లగ్న పత్రికలు’ కార్యక్రమంతో ఇరు కుటుంబాలు వివాహానికి మరింత దగ్గర అయ్యాయి. ఈ వేడుకలో ఒకరికొకరు లగ్న పత్రికలు మార్చుకున్నారు. అంతేగాక ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ప్రస్తుతం ఇటు దగ్గుబాటి అటు బజాజ్ కుటుంబాలలో పూర్తి స్థాయి వేడుకల వాతావరణం కనిపిస్తుంది. ఇంకా సాంప్రదాయ దుస్తులతో పాటు అందమైన ఆభరణాలను ధరించిన మిహీక ఫోటోలు సోషల్ మీడియాలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయని గుర్తు చేస్తున్నాయి.

ప్రస్తుతం రానా మిహీకల వివాహ వేడుకలు జోరుగా నడుస్తున్నాయి. వీరిద్దరూ శనివారం రామానాయుడు స్టూడియోలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. గురువారం జరిగిన హల్దీ వేడుక నుండి మిహీక సంప్రదాయంగా ముస్తాబైన ఫోటోలు చూడవచ్చు. ఎంతో చూడముచ్చటగా వధువు ముఖం పసుపు కాంతులతో మెరుస్తుండగా.. ఆకుపచ్చ లెహంగాలో సీ షెల్ ఆభరణాలు ఆమెకు ఎంతో అందాన్ని తీసుకొచ్చాయి. మే 21న నిశ్చితార్థం చేసుకున్న రానా మిహీకలు ఆగష్టు 8న ఆత్మీయుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు. ఈ పెళ్లి సందర్భంగా కరోనా మహమ్మారి ప్రభావం దృష్టిలో ఉంచుకొని 30మంది ఆత్మీయులతో ఈ పెళ్లిని చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా రానా పెళ్లి గురించి.. పెళ్లి వేడుకలు చూడాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.