Begin typing your search above and press return to search.
మా ఆయన చాలా కూల్ కూల్.. రానాకు మిహికా కితాబు
By: Tupaki Desk | 13 Nov 2020 2:40 PM ISTయంగ్‌హీరో రానా బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్‌బాయ్ చెప్పి ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు మిహికా బజాజ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. కరోనా టైంలో కొంతమంది సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది. అయితే మిహికా మీడియాతో పెద్దగా టచ్‌లో ఉండదు. దాంతో పాటు ఆమె సోషల్‌మీడియాలో కూడా అంతగా యాక్టివ్‌గా ఉండదు. హనీమూన్ టైంలో ఈ ఫొటో షేర్ చేసుకుంది. దసరా సందర్భంగా మిహికా, రానాకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆమె ఏ పోస్ట్ పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన భర్త రానా గురించి ఇన్ స్టా లో ఓ పోస్ట్ చేశారు. ‘మా ఆయన రానా మిస్టర్ కూల్’ అంటూ ఆమె పోస్ట్ చేశారు.
ఇటీవల రానా ఓ యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసి .. ‘వైఆర్‌యూ’ అనే షోని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎందరో సెలబ్రిటీలను ఆయన ఈ షోకి తీసుకురానున్నారు. ఈ ప్రోగ్రామ్ ప్రమోషన్లో భాగంగానే మిహికా ఈ పోస్ట్ పెట్టినట్టు టాక్. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త యూట్యూబ్ చానల్లో పలురకాల కథలను రానా చెప్పబోతున్నాడట. దీంతో పాటు ఇంటర్వ్యూలు సంగీతం, యానిమేషన్, ఫిక్షన్ తదితర అంశాలు ఉండనున్నాయట.
అయితే ఈ సందర్బంగా రానా సోషల్ మీడియాలో ‘ ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించాడు. దీంతో ఓ యువతి ‘రానా నీకు పెళ్లైనా నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అంటూ కామెంట్ పెట్టారు. దీనికి రానా స్పందిస్తూ ‘ మీ కామెంట్ చదివితే మిహికాకు పిచ్చి ఎక్కడం ఖాయం’ అని రిప్లై ఇచ్చారు. దీనికి మిహికా కూడా ఫన్నీగా స్పందించారు. ‘నేను నీతో గడిపిదానికంటే ఎక్కువ పిచ్చి ఎక్కదులే’ అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రానా నటించిన ‘అరణ్య’ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నది. ‘హాథి మేరే సాథి’ ‘1945’ ‘ హిరణ్య కశ్యప’ ‘ విరాటపర్వం’ తదితర చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాలన్ని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశ లో ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఈ పాటికి చాలా వరకు రిలీజ్ అయి ఉండేవి.