Begin typing your search above and press return to search.

దేవరకొండ మూవీ కమర్షియల్ సక్సెస్ అయినట్లేనా..?

By:  Tupaki Desk   |   10 Nov 2020 2:30 AM GMT
దేవరకొండ మూవీ కమర్షియల్ సక్సెస్ అయినట్లేనా..?
X
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ సినిమా 'దొరసాని' తో ప్లాప్ అందుకున్న ఆనంద్ దేవరకొండ రెండో ప్రయత్నంగా ''మిడిల్ క్లాస్ మెలోడీస్'' అనే చిత్రంతో వస్తున్నాడు. 'చూసి చూడంగానే' 'జాను' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంతో వినోద్ అనంతోజు అనే ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కరోనా లాక్ డౌన్ లో ప్రకటించిన ఈ సినిమా అప్పుడే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీ అయింది. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల కానుంది.

కాగా, ఆనంద్ దేవరకొండ ''మిడిల్ క్లాస్ మెలోడీస్'' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు సుమారు 4 కోట్లకు తీసుకున్నట్లు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ సినిమాతో ప్లాప్ అందుకున్న హీరో రెండో మూవీకి ఇది మంచి డీల్ అనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్ చేయడానికి ప్రొడ్యూసర్ కి దాదాపు కోటీ యాభై ల‌క్ష‌లు వరకు ఖర్చు అయిందట. అయితే ఇప్పుడు ఈ సినిమాని 4 కోట్లకు అమెజాన్ కి అమ్మడం నిజమైతే దేవరకొండ మూవీ హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా రిలీజ్ కి ముందే లాభాల్లో ఉన్నట్లే లెక్క. ఈ నేపథ్యంలో ఆనంద్ దేవ‌ర‌కొండ త‌న రెండో సినిమాతోనే కమర్షియల్ స‌క్సెస్ అందుకున్నాడ‌ని ఇప్పుడు ఇండ‌స్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అయితే ఆనంద్ దేవరకొండ కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.