Begin typing your search above and press return to search.

మిక్కీతో అదో పెద్ద ప్రాబ్లమ్‌

By:  Tupaki Desk   |   11 May 2016 9:30 AM GMT
మిక్కీతో అదో పెద్ద ప్రాబ్లమ్‌
X
ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలన్నీ మిక్కీ.జె.మేయర్‌ వే. బ్రహ్మోత్సవం.. అ..ఆఆ.. ఒక్క అమ్మాయి తప్ప.. ఇలా వరుసగా చాలా సినిమాలకు మిక్కీయే కంపోజర్‌. బాగానే ఉంది. అందరూ మిక్కీ టైమ్‌ వచ్చేసిందనే అంటున్నారు. కాకపోతే గతంలో మనోడి ఎక్కువగా పెద్ద పెద్ద హిట్లు కొట్టలేకపోవడానికి కారణం ఒకటి ఉందట.

హ్యాపీ డేస్‌ వంటి పెద్ద హిట్టొచ్చాక.. ఇండస్ర్టీలో పెద్ద సినిమాలు పడటానికి చాలా టైమ్‌ పట్టేసింది. అయితే దానికి కారణం.. లండన్‌ ట్రినిటీ కాలేజీలో మ్యూజిక్‌ చదువుకున్న మిక్కీ.. ఒక సినిమా ఫైనల్‌ మాష్టర్‌ ఆడియో తయారుచేయాలంటే.. మిక్సింగ్‌ లండన్‌ లో చేద్దాం అనేవాడట. అలా చేయాలంటే కనీసం 50 లక్షలు ఖర్చవుతుంది. కాకపోతే ఆ క్వాలిటీ వేరు. కాని మన సినిమాల సక్సెస్‌ రేటు పరంగా చూస్తే.. మనోళ్లు సదరు సినిమా మ్యూజిక్‌ ను సినిమా వచ్చినప్పుడే కాని తరువాత వినడం లేదని అర్దమవుతోంది. ఆ మాత్రం దానికి.. లండన్ లో ఎందుకు.. చెన్నయ్‌ లో మిక్సింగ్‌ చేస్తే చాలుగా అనేవారట నిర్మాతలు. క్వాలిటీలో కాంప్రమైజ్‌ కావడం ఇష్టం లేక మనోడు కొన్ని సినిమాలు వదులుకుంటే.. మిక్కీని పెట్టుకుంటే బడ్జెట్‌ వాచిపోతుందిలే అనే ఫీలింగ్‌ తో మిగిలినవారు మనోడ్ని దూరం పెట్టారు.

ఇప్పుడు మాత్రం మిక్సింగులూ వగైరా చెన్నయ్‌ అండ్‌ ముంబయ్‌ లో ఫినిష్‌ చేయడంతో.. మిక్కీ వెనుక మనోళ్ళు క్యూ కడుతున్నారు. సో.. టాలెంట్‌ ఉంటే సరిపోదు.. దానిని ఎలా అమ్ముకోవాలో కూడా తెలియాలి.