Begin typing your search above and press return to search.

హై ఇంటెన్స్ యాక్షన్ - అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటున్న 'మైఖేల్' టీజర్..!

By:  Tupaki Desk   |   20 Oct 2022 12:40 PM GMT
హై ఇంటెన్స్ యాక్షన్ - అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటున్న మైఖేల్ టీజర్..!
X
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''మైఖేల్''. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా అన్ని భాషల్లో టీజర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

'మైఖేల్' టీజర్ ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ - నేచురల్ స్టార్ నాని - కన్నడ హీరో రక్షిత్ శెట్టి - బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్ - హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాన్వీ కపూర్ - దర్శక ద్వయం రాజ్ & డీకే వంటి సినీ ప్రముఖులు లాంచ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు. హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ - అద్భుతమైన విజువల్స్ - స్టన్నింగ్ స్క్రీన్స్ ప్రెజెన్స్ తో కూడిన ఈ పవర్ ప్యాకెడ్ టీజర్ ఆకట్టుకుంటోంది.

'మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి' అని అంటుండగా.. 'వెంటాడి ఆకలిని తీర్చుకోడానికి వేటాడటం తెలియాల్సిన పనిలేదు మాస్టర్' అని సందీప్ కిషన్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. ఇందులో సందీప్ మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. యంగ్ హీరో తన కెరీర్ లోనే తొలిసారిగా ఇలాంటి పవర్ ఫుల్ ఇంటెన్స్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ స్పెషల్ యాక్షన్ రోల్‌ లో నటించగా.. డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటించినట్లు తెలుస్తోంది. వరుణ్ సందేశ్ - వరలక్ష్మి శరత్‌ కుమార్ - అయ్యప్ప శర్మ - అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇందులో ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉండేలా ఓ విలక్షణమైన స్క్రిప్ట్ తో ''మైఖేల్'' సినిమా తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

ఈ టీజర్ లో యాక్షన్ సీన్స్ - ఎలివేషన్ షాట్స్ హైలెట్ గా నిలవగా.. దీనికి విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ తో పాటుగా తగినంత రొమాన్స్ కూడా ఉంటుందని సందీప్ కిషన్ - దివ్యాంశ కౌశిక్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సూచిస్తున్నాయి. స్టోరీ ఏంటనేది రివీల్ చేయనప్పటికీ.. ఓ పసికందు మేజర్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తోంది. సందీప్ ఎవరి మీదనో రివేంజ్ తీర్చుకోడానికి క్రూరంగా మారినట్లుగా కనిపిస్తోంది.

దీనికి తగ్గట్టుగా 'మైఖేల్.. మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం..' అని అయ్యప్ప శర్మ వాయిస్ ఓవర్ తో అంటుండగా.. 'నేను మనిషిగానే ఉంటాను మాస్టర్.. దేవుడు అవ్వాలనే ఆశ లేదు' అని సందీప్ చెప్పడం ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసిందని చెప్పాలి. కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపిస్తుందనే నమ్మకం కలిగిస్తుంది.

''మైఖేల్'' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ పై భారీ స్థాయిలో రూపొందిస్తున్నాయి. భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూర్చగా.. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. గాంధీ నడికుడికార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. ఆర్ సత్యనారాయణన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్.. ఈసారి 'మైఖేల్' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.