Begin typing your search above and press return to search.

చీరలో సన్నీ.. వెల్ కం చెబుతుంది!

By:  Tupaki Desk   |   15 Sep 2016 6:09 AM GMT
చీరలో సన్నీ.. వెల్ కం చెబుతుంది!
X
సన్నీలియోన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఒకప్పుడు పోర్న్ అనే పదాన్ని వాడటానికి కూడా కాస్త వెనకా ముందూ ఆలోచించేవారంతా.. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు! బాలీవుడ్ రంగ ప్రవేశం చేసే ముందు పోర్న్ స్టార్ హోదాలో వచ్చినా... ఇప్పుడు మాత్రం సన్నీ లియోన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. అయినా కూడా ఈమెను ద్వేషించే వాళ్లు ఇప్పటికీ ద్వేషిస్తూనే ఉండగా అభిమానించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో తాజాగా కేరళలోని ఒక కాలేజీలో వెల్ కం పార్టీ పబ్లిసిటీకోసం - స్వాగతం పలకడంకోసం చీరకట్టులో ఉన్న సన్నీ ఫ్లెక్సీల్లో ప్రత్యక్షమైంది!

కొట్టాయం జిల్లాలోని శ్రీనారాయణ పాలిటెక్నిక్ కాలేజీలో సెకండియర్ స్టూడెంట్స్ జరుపుతున్న వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కాలేజిలో జరుగుతున్న వెల్ కం పార్టీలో స్వాగతం పలకడానికి పెట్టిన ఫ్లెక్సీల్లో పోర్న్ స్టార్స్ సన్నీలియోన్ - మియా కలీఫాలు స్వాగతం పలుకుతూ నిల్చున్నారు. అదీ కూడా అచ్చమైన కేరళ సాంప్రదాయ దుస్తులలో తెల్లని చీర తో వయ్యారంగా నమస్కారం చేస్తూ అథిథులను ఆహ్వానిస్తున్నారు ఈ భామలు.

సాధారణంగా ఏ రాజకీయ నాయకుల ఫోటోలతోనో - సినిమా హీరోల ఫోటోలతోనో కొంతమంది ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం దేశనాయకులు - ఆదర్శవంతమైన వ్యక్తుల ఫోటోలతో బ్యానర్లు ఏర్పాటుచేస్తారు కానీ... ఈ కాలేజీ స్టూడెంట్స్ మాత్రం పోర్న్ స్టార్స్‌ పై తమకున్న అభిమానమో లేక ప్రత్యేకతకోసం ఆరాటమో కానీ.. ఏకంగా సన్నీలియోన్ - మియా ఖలీఫాలను అచ్చమైన కేరళ కుట్టీల్లాగా తయారుచేసి బ్యానర్లు కట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.