Begin typing your search above and press return to search.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స..!

By:  Tupaki Desk   |   14 Aug 2020 7:00 PM IST
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స..!
X
ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సన్నిహితులు.. అభిమానులకు వీడియో ద్వారా వెల్లడిస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే కోలుకుంటానని ఆయనే స్వయంగా తెలిపారు. ఈ క్రమంలో ఆగస్టు 5న నుండి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో బాలసుబ్రమణ్యం కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసారు.

ఆగస్టు 13న అర్థ రాత్రి సడన్ గా బాలసుబ్రమణ్యం పరిస్థితి క్షీణించిందని ఎంజీఎం హెల్త్ కేర్ తన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వైద్య నిపుణుల సూచన మేరకు ఆయన్ను ఐసీయూలో చేర్పించి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. వైద్య నిపుణుల బృందం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.