Begin typing your search above and press return to search.

మీటూ ఉద్యమ సృష్టికర్త ఆవేదన..!

By:  Tupaki Desk   |   25 Oct 2018 2:30 PM GMT
మీటూ ఉద్యమ సృష్టికర్త ఆవేదన..!
X
ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ సినీ పరిశ్రమను ఒక కుదుపు కుదిపేస్తున్న మీటూ ఉద్యమం ఈమద్య మొదలైనది కాదు. తనూశ్రీ దత్తా ఎప్పుడైతే నానా పటేకర్‌ పై ఆరోపణలు చేసిందో అప్పుడే ఇండియాలో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కాని అంతకు ముందే ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో మీటూ ఉద్యమం తారా స్థాయిలో సాగుతూ వస్తుంది. కేవలం అమెరికాలోనే మీటూ ఉద్యమం కారణంగా దాదాపు 200 మంది సెలబ్రెటీల బతుకులు రోడ్డున పడ్డట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ఉద్యమంను ప్రారంభించింది ఎవరు, అసలు మీటూ అంటు మొదట ఈ రెండు అక్షరాలను తీసుకు వచ్చింది ఎవరు, ఇప్పుడు ఆమె ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రయత్నించింది.

మీటూ ఉద్యమంను మొదట మొదలు పెట్టిన వ్యక్తి తరానా బుర్కే. ఈమె అమెరికాలో మహిళా హక్కుల కోసం పోరాడే నాయకురాలు. ఈమె ఆఫ్రికన్‌ దేశానికి చెందిన మహిళ. అమెరికాలో స్థిరపడిపోయిన ఈమె మహిళలపై జరుగుతున్న లైంగిక దాడికి వ్యతిరేకంగా ‘మీటూ’ ఉద్యమంను పదేళ్ల క్రితం ప్రారంభించారు. ఆ సమయంలో పెద్దగా ఎవరు స్పందించలేదు. కాని గత సంవత్సరం హాలీవుడ్‌ నటి హాలీసా మలానో మీటూ హ్యాష్‌ ట్యాగ్‌ తో సోషల్‌ మీడియాతో తనపై జరిగిన లైంగిక దాడిని ప్రపంచానికి చెప్పింది. అప్పటి నుండి మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతూనే ఉంది. ప్రస్తుతం ఇండియాలో మీటూ సంచలనం సృష్టిస్తోంది. స్టార్స్‌ తో పాటు కేంద్ర మంత్రి పై కూడా మీటూ ప్రభావం పడినది.

ఇంతగా సంచలనం సృష్టిస్తున్న మీటూ ఉద్యమం గురించి సృష్టికర్త తరానా బుర్కే స్పదిస్తూ.. నేను అనుకున్నది ఒకటైతే, మరో విధంగా జరుగుతుంది. మీటూ ఉద్యమంలో భాగంగా మహిళలు తమ ఆవేదన జనాలకు చెప్పుకుంటారని భావించాను. అలా చెబితే వారికి న్యాయం జరుగుతుందనుకున్నాను. కాని మీటూ ఉద్యమంలో భాగంగా లైంగిక ఆరోపణలు చేసిన వారిపైనే విమర్శలు వస్తున్నాయి. లైంగిక ఆరోపణలు చేసిన వారిని కృంగిపోయేలా జనాలు చేస్తున్నారు. మహిళలపై మగాళ్ల ఆధిపత్యం తగ్గాలని తాను చేపట్టిన ఉద్యమం ఆ లక్ష్యంను చేరుకోలేక పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మీటూ ఉద్యమం కారణంగా మహిళలపై లైంగిక వేదింపులు తగ్గాయనేది అంతర్జాతీయ మీడియా సంస్థ సర్వే చెబుతుంది. తరానా బుర్కే పూర్తిగా కాకున్నా కాస్త అయినా మీటూ ద్వారా విజయాన్ని దక్కించుకున్నట్లే.