Begin typing your search above and press return to search.

మగాళ్ళూ మీటూ బాధితులే

By:  Tupaki Desk   |   18 Oct 2018 2:30 PM GMT
మగాళ్ళూ మీటూ బాధితులే
X
ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపేస్తున్న మీటూ ఉద్యమం సినిమాల్లోనే కాదు రాజకీయాలతో పాటు కార్పొరేట్ సెక్టార్ లో కూడా ప్రవేశించింది. ఎక్కడిక్కకడ మహిళలు తాము గతంలో మగాళ్ల ద్వారా గతంలో ఎదురుకున్న చేదు అనుభవాలు బయటపెట్టి వాళ్ళ పరువు తీయడమే కాదు కాస్త లేట్ అయినా చర్యలు తీసుకునే విధంగా కొందరు చట్టప్రకారంగా కూడా ముందుకు సాగుతున్నారు. మీ టూలో ఇప్పటి దాకా కేవలం మగాళ్ల కామ వాంఛకు బలైన ఆడాళ్ళ గురించిన కథలు మాత్రమే బయట పడ్డాయి.

కానీ దీనికి మరో కోణం ఉంది. అది కూడా రివర్స్ లో. అంటే స్త్రీల ద్వారా బాధింపబడిన అబ్బాయిలన్న మాట. ఇప్పుడు మెల్లగా ఇది కూడా చర్చలోకి వస్తోంది. పైగా పేర్లతో సహా బాధితులు బయటికి రావడం అందరికి నోట మాట రాకుండా చేస్తోంది. అధ్యాయన్ సుమన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం హీరో అయిన ఇతగాడు చేసిన సినిమాలు తక్కువే కానీ మోడల్ గా మంచి గుర్తింపు ఉంది. రెండేళ్ల క్రితం ప్రముఖ హీరోయిన్ కంగనా రౌనత్ ఇతని మీద బ్లాక్ మేజిక్ అంటే చేతబడి లాంటిది ప్రయోగించి వశపరుచుకొని శారీరకంగా కూడా హింసించిందట. ఈ విషయాన్నీ సుమన్ ఇంతకు ముందు చెప్పాడు కానీ అందరూ నవ్వి కొట్టిపారేశారు. కానీ మీటూ ఉద్యమం పుంజుకోవడంతో తనకు బలం వచ్చినట్టు ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

మరొకరు సకీబ్ సలీం. పరిశ్రమకు వచ్చిన మొదట్లో ఓ వ్యక్తి ఇతని మీద అఘాయిత్యం చేయబోతే మొహం మీద గుద్దేసి తప్పించుకుని వచ్చాడట. సలీం ప్యాంట్ లోపల చేయి పెట్టి దాని ద్వారా హింసించే ప్రయత్నం చేసాడట. మొత్తానికి ఈ ఇద్దరి కథ విన్నాక షాక్ తినని వారు లేరు. అరవింద సమేతలో హీరో చెప్పినట్టు మగాడు ఇంకో మగాడిని చెరిచడం అంటే ఏమో అనుకున్నాం కానీ బాలీవుడ్ లో నిజంగానే ఉందండోయ్.