Begin typing your search above and press return to search.

మీటూ: బిగ్‌ వికెట్ నంబ‌ర్- 2

By:  Tupaki Desk   |   12 Oct 2018 8:30 AM GMT
మీటూ: బిగ్‌ వికెట్ నంబ‌ర్- 2
X
మీటూ- ఇండియా ఉద్య‌మం బ‌డాబాబుల కొంప ముంచుతోంది. ఒక్కొక్క‌రి ఉద్యోగాల‌కు ఎస‌రొస్తోంది. ఊస్టింగ్ లెట‌ర్స్ అందుతున్నాయి. కార్పొరెట్ కంపెనీల‌న్నీ వీళ్ల‌తో సినిమాలు తీయ‌లేం! అంటూ చేతులెత్తేస్తున్నాయి. ఇదో ఆక‌స్మిక ప‌రిణామం. బాలీవుడ్‌ లో ప‌లు చిత్రాల‌కు భారీ థ్రెట్ పొంచి ఉంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.

మొన్న‌టికి మొన్న `సూప‌ర్ 30` టీమ్ వికాస్ బాల్ ఉద్వాస‌న‌కు సిద్ధ‌మైంది. హృతిక్ అంత‌టివాడే తాను త‌ప్పు చేసిన వారికి స‌పోర్ట్ చేయ‌లేనని వ్యాఖ్యానించాడు. అంత‌కుముందు పాంథ‌మ్ కంపెనీ సైతం వికాస్ బాల్ తో భాగ‌స్వామ్యాన్ని ర‌ద్దు చేసుకుంది. ఈ వ‌రుస‌లో మ‌రో బిగ్ బికెట్ సుభాష్ క‌పూర్. ప్ర‌స్తుతం సుభాష్ క‌పూర్ పై గీతిక త్యాగి అనే న‌టీమ‌ణి తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ప్రొడ్యూస‌ర్ గిల్డ్ విచార‌ణ‌కు ఆదేశించింది. దీంతో పోలీస్ విచార‌ణ ప్రొసీడింగ్స్‌ కి రంగం సిద్ద‌మైంది. ఆ క్ర‌మంలోనే మిస్ట‌ర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ సుభాష్ క‌పూర్ తెర‌కెక్కించ‌నున్న `మొఘ‌ల్‌` చిత్రం నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించాడు. ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ చిత్రం నుంచి తాము కూడా త‌ప్పుకుంటున్నామ‌ని టీసిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్ వెల్ల‌డించారు.

ఈ రెండు ప‌రిణామాల‌తో ఇన్నాళ్లు సుభాష్‌ని వెన‌కేసుకొచ్చిన బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తాక‌పూర్ సైతం మ‌న‌సు మార్చుకుని తొంద‌ర్లోనే తాము నిర్మించ‌నున్న వెబ్ సిరీస్ నుంచి సుభాష్‌ని డిస్మిస్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. సుభాష్ పై విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కూ తాము అత‌డికి అండ‌గా నిల‌వ‌లేమ‌ని తెలిపారు. దీంతో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క వెబ్ సిరీస్‌గా చెబుతున్న `ది వెర్డిక్ట్‌` ప్రాజెక్ట్ నుంచి సుభాష్‌ కి ఊస్టింగ్ ఇచ్చిన‌ట్ట‌య్యింది. మొత్తానికి ఒకే ఒక్క ఆరోపణ ఆ రేంజులో కొంప ముంచింద‌న్న‌మాట‌! ఈ ఉద్య‌మంతో ఇంకా ఎంద‌రు ప్ర‌ముఖుల‌కు మూడ‌నుందో అన్న టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుందిప్పుడు.