Begin typing your search above and press return to search.

కబాలి.. బాహుబలి.. తరువాత ఇదే

By:  Tupaki Desk   |   4 Oct 2017 4:30 AM GMT
కబాలి.. బాహుబలి.. తరువాత ఇదే
X
ఇళయ దళపతిగా తమిళ ప్రేక్షకులు ఎంతో అభిమానంగా పిలుచుకునే తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ మెర్సల్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ దీపావళికి ముందు ఈ సినిమా థియేటర్లకు రానుంది. విజయ్ కు తమిళనాట ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్నందున ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హడావుడి మామూలుగా లేదు. ఈ సినిమాకు ఇప్పుడో అరుదైన గౌరవం దక్కింది.

ఫ్రాన్స్ లోని పారిస్ లో లె గ్రాండ్ రెక్స్ అనే థియేటర్ ఉంది. యూరప్ మొత్తానికి ఇదే అతి పెద్ద థియేటర్. ఇందులో ఒకేసారి రెండువేల మందికి పైగానే సినిమా చూసే అవకాశముంది. ఇంతవరకు ఈ స్క్రీన్ పై రెండు భారతీయ సినిమాలే ప్రదర్శితమయ్యాయి. తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన కబాలి - దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి-2 షో లు ఈ థియేటర్లో పడ్డాయి. ఈ రెండింటి తరవాత ఈనెల 18న మెర్సల్ ఇక్కడ ప్రదర్శితమవనుంది. ఈ విషయం థియేటర్ యాజమాన్యం ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించింది.

మెర్సల్ సినిమాలో కాజల్ అగర్వాల్ - సమంత - నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ప్రిన్స్ మహేష్ లేటెస్ట్ సినిమా స్పైడర్ లో తన విలనిజంతో మెప్పించిన ఎస్.జె.సూర్య ఇందులోనూ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను ‘అదిరింది’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు.