Begin typing your search above and press return to search.

యుద్ధం అంత ఫాస్ట్ గా ముగిసిందా

By:  Tupaki Desk   |   9 April 2018 10:43 AM GMT
యుద్ధం అంత ఫాస్ట్ గా ముగిసిందా
X
న్యాచురల్ స్టార్ నాని కృష్ణార్జునుల యుద్ధం మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. దీని మీద ప్రేక్షకులతో పాటు ట్రేడ్ కూడా బాగా ఆసక్తిగా ఉంది. నాని డ్యూయల్ రోల్ చేయటంతో పాటు ఎంటర్ టైన్మెంట్ బాగా డీల్ చేస్తాడని పేరున్న దర్శకుడు మేర్లపాక గాంధీ దీనికి ప్లస్ గా మారుతున్నాడు. ఇక దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్ డేట్ షేర్ చేసుకున్నాడు గాంధీ. ఈ మూవీ షూటింగ్ కేవలం 74 రోజుల్లోనే పూర్తయ్యిందట. సాధారణంగా ఏ సినిమా అయినా కనీసం ఆరు నెలలు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత తక్కువ సమయం అంటే రికార్డే. దానికి కారణం కూడా నానినేనట. ఇచ్చిన కాల్ షీట్స్ ప్రకారం షూటింగ్ ఎక్కడ ప్లాన్ చేసినా పూర్తిగా సహకరించి చేయటం వల్లే ఇది సాధ్యమయ్యింది అంటున్నాడు.

టాలీవుడ్ ఇంత వేగంగా సినిమాలు తీస్తాడు అనే పేరుంది ఒక్క పూరి జగన్నాధ్ కు మాత్రమే. అనుకున్న తేదికి షూటింగ్ స్టార్ట్ చేయటంతో పాటు చెప్పిన డేట్ కి రిలీజ్ చేయటం పూరి ప్రత్యేకత. జయాపజయాలు పక్కన పెడితే ఇలా చేయటం వల్ల నష్టాల కన్నా లాభాలే ఎక్కువ. మాస్ ప్లస్ క్లాస్ తరహాలో రెండు పూర్తి విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న నాని దీంతో మరో హిట్ కొడతాను అని గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. వారం రోజుల్లోనే భరత్ అనే నేను వస్తుంది కాబట్టి ఆలోచించమని హక్కులు కొన్న దిల్ రాజు అడిగినా కూడా నాని ససేమిరా అన్నట్టు ఇప్పటికే బలమైన టాక్ చక్కర్లు కొడుతోంది. సో నాని నమ్మకాన్ని బట్టి చూస్తే కంటెంట్ ఉన్నట్టే అనిపిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ తో పాటు డెబ్యు హీరొయిన్ రుక్సన్ మీర్ నాని పక్కన ఆడిపాడనున్నారు.