Begin typing your search above and press return to search.

సాహో సంస్థతో గాంధీ ప్రాజెక్ట్

By:  Tupaki Desk   |   17 Jun 2018 10:30 AM GMT
సాహో సంస్థతో గాంధీ ప్రాజెక్ట్
X
మొదటి రెండు సినిమాలు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్-ఎక్స్ ప్రెస్ రాజాతో పరిశ్రమతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు మేర్లపాక గాంధీకి కృష్ణార్జున యుద్ధం పెద్ద బ్రేక్ వేసింది. న్యాచురల్ స్టార్ నానిని డ్యూయల్ రోల్ లో చూపించినా ఫలితం దక్కలేదు. తన బలమైన ఎంటర్ టైన్మెంట్ వదిలేసి కొత్తగా మాస్ జానర్ లో ట్రై చేద్దామన్న గాంధీ ఆశలు ఫలించలేదు. నిజానికి స్క్రీన్ ప్లే బలమైన గాంధీ దాన్ని ఏ మాత్రం వాడకపోవడం నాని మూవీని దెబ్బ తీసింది. థ్రిల్ కలిగించే అంశాలతో రెండూ జర్నీ బేస్డ్ మూవీస్ తో మెప్పించిన గాంధీ మళ్ళి ట్రాక్ లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. శర్వానంద్ హీరోగా తనతో ఎక్స్ ప్రెస్ రాజా తీసిన సంస్థ యువి కోసం మేర్లపాక మరోసారి టై అప్ కావడం దాదాపు ఓకే అయినట్టే. కథ కూడా సిద్ధంగా ఉందని హీరో ఎవరో డిసైడ్ కాకపోవడం వల్లే ప్రకటన ఆలస్యం అవుతోందని తెలిసింది. డేట్స్ అందుబాటును బట్టి గాంధీ ఇద్దరు హీరోలను ఆప్షన్ గా పెట్టుకున్నాడని అందులో ముందు ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళతో ఉండే అవకాశం ఉందని సమాచారం.

ప్రభాస్ తో రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో సాహో నిర్మిస్తున్న యువి సంస్థ మరోవైపు చిన్న ప్లస్ మీడియం బడ్జెట్ సినిమాల మీద కూడా దృష్టి సారిస్తోంది. విజయ్ దేవరకొండ టాక్సీ వాలాతో టై అప్ అయిన ఈ సంస్థ మేర్లపాక గాంధీ సినిమాను వచ్చే నెల నుంచి మొదలు పెట్టే అవకాశం ఉంది. ఎక్స్ ప్రెస్ రాజా తరహాలోనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా గాంధీ రాసుకున్నట్టు టాక్. నవల రచయిత మేర్లపాక మురళి వారసత్వాన్ని ఈ రూపంలో అందుకున్న గాంధీ మళ్ళి తానేంటో ఈ సినిమాతో మళ్ళి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా రామ్ లేదా శర్వానంద్ తో కానీ ఈ కొత్త సినిమా ఉండొచ్చు అని ఒక అంచనా. మరో రెండు మూడు వారాల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుంది . కృష్ణార్జున యుద్ధంలో ఓడిపోయిన మేర్లపాక గాంధీ తనకు బాగా కలిసివచ్చిన ఎక్స్ ప్రెస్ జర్నీనే కొనసాగించేలా ఉన్నాడు. చూద్దాం.