Begin typing your search above and press return to search.

`ఫిలింక్రిటిక్స్`లో `న్యూస్ కాస్ట‌ర్స్` విలీనం!

By:  Tupaki Desk   |   16 Sep 2021 2:30 PM GMT
`ఫిలింక్రిటిక్స్`లో `న్యూస్ కాస్ట‌ర్స్` విలీనం!
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ నిరంత‌ర వార్తా స్రవంతిలో ఎంద‌రో జ‌ర్న‌లిస్టులు సేవ‌లందిస్తున్న సంగతి తెలిసిందే. 50ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన ఫిలింక్రిటిక్స్ లో మ‌ద్రాసు ప‌రిశ్ర‌మ నుంచి ఉన్న‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అంతా ఉన్నారు. `క‌లం` ర‌చ‌యిత‌లైన జ‌ర్న‌లిస్టుల‌కు ఈ సంఘంలో ప్రాధాన్య‌త ఉంది. అలాగే న్యూస్ కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ లో ఎల‌క్ట్రానిక్ వెబ్ మీడియా ప్ర‌తినిధులు ఉన్నారు. న్యూస్ కాస్ట‌ర్స్ సంఘానికి అప్ప‌ట్లో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ గా పేరు మార్చారు. ఇక‌పోతే ఈ ఇరు సంఘాలు క‌లిసి ప‌ని చేయ‌క‌పోవ‌డంపై కొన్ని విమ‌ర్శ‌లున్నాయి. ప‌రిశ్ర‌మ‌లో చాలామంది పెద్ద‌లు జ‌ర్న‌లిస్టులంతా క‌లిసి ప‌ని చేయాల‌ని.. హెల్త్ కార్డులు.. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిని పొందాల‌ని ఆకాంక్షించారు. ఫిలింక్రిటిక్స్ కి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి స‌హా సినీపెద్ద‌ల అండ‌దండ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల కొత్త అధ్య‌క్షులు ప్ర‌భు ఇత‌ర‌ కార్య‌వ‌ర్గాన్ని మెగాస్టార్ బ్లెస్ చేసిన సంగ‌తి తెలిసిందే.

చాలా కాలంగా క్రిటిక్స్ లో న్యూస్ కాస్ట‌ర్స్ మెర్జింగ్ పై చ‌ర్చ సాగుతోంది. కానీ ఈ మెర్జింగ్ కి క్రిటిక్స్ లో సీనియ‌ర్స్ నుంచి అభ్యంత‌రాలున్నాయ‌ని ప్ర‌చారం ఉంది. తాజాగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులమైన ఏ.ప్రభు.. పర్వతనేని రాంబాబు ఆ మేర‌కు ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. తొలుత ప్రారంభించిన న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ లో సభ్యత్వం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ... మెర్జింగ్ ప్ర‌స్థావ‌న తెచ్చారు. అలాగే రెండు అసోసియేష‌న్ల‌లో స‌భ్య‌త్వం ఫిల్ట‌రింగ్ పైనా ప్ర‌స్థావించారు. అధ్య‌క్ష కార్య‌ద‌ర్శుల లేఖ సారాంశ‌మిదీ.

``ఇటీవల జరిగిన ఫిల్మ్ క్రిటిక్స్అసోసియేషన్ ఎన్నికలలో మేము ఇరువురము అధ్యక్ష కార్యదర్శులుగా నూతన కార్యవర్గం ఏర్పడిన విషయం తెలిసిందే. ఒకే ప్రొఫెషన్ కు సంబంధించిన రెండు అసోసియేషన్స్ లో కొనసాగటం భావ్యం కాదు కావునా ``తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్`` సభ్యత్వానికి మేము ఇరువురం రాజీనామా చేస్తున్నాము. అయితే రెండు అసోసియేషన్స్ ను మెర్జ్ చేయాలి అన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్న కారణంగా మా రాజీనామాల విషయంలో కొంత జాప్యం జరిగినది. అయితే ఈ మెర్జర్ విషయంలో మా సభ్యులు చాలా మంది విముఖత వ్యక్తం చేస్తున్నారు. సభ్యుల మనోగతాన్ని గౌరవించాల్సిన భాధ్యత మా మీద ఉంది.అంతే కాకుండా మా నూతన కార్యవర్గం ఏర్పడిన మరు క్షణమే మమ్ములను మీరు తొలగించారు. కావునా ఇప్పుడు మా రాజీనామాలు కేవలం సాంకేతికపరమైన లాంఛనం మాత్రమే.

రెండు అసోసియేషన్స్ అస్తిత్వం లో ఉన్నప్పటికీ వెల్ఫేర్ యాక్టివిటీ విషయంలో మాత్రం సంయుక్త కార్యాచరణతో ముందుకు వెళ్ళటం చిత్ర పరిశ్రమలో ఇరువురికి గౌరవ ప్రదంగా ఉంటుంది అనే పతిపాదనను మీ ముందుకు తెస్తున్నాము. కావునా ఆ పరంగా మీరు కూడా ఆలోచించి ఈ ప్రతిపాదనను స్వాగతిస్తూ అడుగు ముందుకు వేస్తారని ఆశిస్తున్నాము.. అని వారు కోరారు. ఇక రెండు అసోసియేష‌న్ల‌లో స‌భ్య‌త్వం ఉంటే కొన్ని స‌మ్య‌లున్నాయి. సంక్షేమ ప్ర‌తిఫ‌లాలు అనేవి ఎవ‌రైనా ఏ ప‌రిశ్ర‌మ నుంచైనా ఒక సంఘం నుంచే పొందాలి. అందుకే క్రిటిక్స్ నుంచి చాలా విష‌యాల్లో విముఖ‌త ఉన్న‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.