Begin typing your search above and press return to search.

వీడియో సాంగ్: హత్తుకునే జీరో రొమాన్స్

By:  Tupaki Desk   |   24 Nov 2018 10:16 AM GMT
వీడియో సాంగ్: హత్తుకునే జీరో రొమాన్స్
X
కింగ్ ఖాన్ గా బాలీవుడ్ లో అశేషమైన ఫాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న షారుఖ్ ఖాన్ కొత్త సినిమా జీరో మీద అంచనాలు మాములుగా లేవు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ వంద మిలియన్ల వ్యూస్ కు చేరువలో ఉంటూ ప్రేక్షకులకు దీని మీద ఏ రేంజ్ లో ఆసక్తి ఉందొ చెప్పకనే చెబుతోంది. డిసెంబర్ 21 రిలీజ్ ఫిక్స్ చేసిన జీరోలో మొదటి ఆడియో సింగల్ ని వీడియో రూపంలో విడుదల చేసింది టీమ్. ఒకప్పుడు కింగ్ అఫ్ రొమాన్స్ గా అమ్మాయిల మనసులు దోచే ప్రేమికుడిగా యువతుల గుండెల్లో నిద్రపోయిన షారుఖ్ ఖాన్ మరోసారి అనుష్క శర్మ కోసం అతడిని బయటికి తీసుకొచ్చాడు.

పార్టీకి రమ్మని పిలిచి ఒంటరిగా డ్రింక్ తాగమని ఆఫర్ చేసిన అనుష్క శర్మ తో ఈ మాత్రం ఒక్కడినే మీరట్ బార్ లో చేయలేనా అంటూ అమాయకంగా ప్రశ్నిస్తూ పాట అందుకోవడం నేరుగా హృదయాలను తాకేలా ఉంది. మేరె నామ్ తూ అంటూ సాగే ఈ స్వీట్ మెలోడీని అజయ్-అతుల్ ద్వయం కంపోజ్ చేయగా ఇర్షాద్ కమిల్ అద్భుతమైన సాహిత్యానికి అజయ్ జోధపుర్కర్ గాత్రం ప్రాణం పోసింది.

నీ పెదవుల రంగుకి సరితూగని ఏ రంగైనా అది రంగేనా అని ప్రశ్నిస్తూ నీ నల్లని కురుల నుంచి వచ్చే పరిమళానికి సరితూగని ఏ వాసనైనా విలువ ఉంటుందా అంటూ ఆద్యంతం కవితాత్మకంగా వర్ణించిన తీరు మ్యూజిక్ లవర్స్ ని ఫిదా చేసేలా ఉంది. సాలిడ్ గా గుర్తుండిపోయే మ్యూజికల్ ఆల్బమ్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో రాలేదు. ఆ లోటు జీరో తీర్చేలా ఉంది. ఒకప్పుడు ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్స్ కేరాఫ్ అడ్రెస్ గా షారుఖ్ సినిమాలే నిలిచేవి. జీరో వాటి సరసన చేరేలా ఉంది. శారీకర వైకల్యంతో బాధ పడే ఇద్దరు ప్రేమికులు దాన్ని మర్చిపోయి ఆనందంలో ఎలా మునిగి తేలుతారో వర్ణించేందుకు ఈ పాటను ఉదాహరణగా చెప్పొచ్చు. వీడియో చూసాక మీదీ అదే అభిప్రాయమవుతుంది