Begin typing your search above and press return to search.

49 రోజుల తర్వాత రిలీజవుతున్న సినిమా అదే

By:  Tupaki Desk   |   19 April 2018 7:58 AM GMT
49 రోజుల తర్వాత రిలీజవుతున్న సినిమా అదే
X
ఎట్టకేలకు కోలీవుడ్లో సమ్మెకు తెరపడింది. అక్కడ మళ్లీ థియేటర్లు తెరుచుకుంటున్నాయి. కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. సమ్మెకు తెరపడిన రెండు రోజుల వ్యవధిలోనే కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుండటం విశేషం. 49 రోజుల విరామం తర్వాత అక్కడ రిలీజవ్వబోతున్న తొలి సినిమా ‘మెర్క్యురీ’. ఈ చిత్రం తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లోనూ గత వారమే విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం విడుదలైంది. సమ్మె కారణంగా తమిళనాడు వరకు రిలీజ్ ఆపారు. ఇది మూకీ సినిమా కావడం.. ఏ భాషకైనా ఒకటే వెర్షన్ కావడంతో తమిళంలో రిలీజ్ కోసం ప్రత్యేకంగా సన్నాహాలు చేయాల్సిన అవసరం లేకపోయింది.

చాన్నాళ్ల తర్వాత థియేటర్లు తెరుచుకుంటుండటంతో ఏ సినిమా అయినా ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టే అవకాశముంది. కాబట్టి ప్రమోషన్ గురించి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రభుదేవా కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రంతో పాటు మరో రెండు చిన్న సినిమాలు విడుదల చేసుకోవడానికి కూడా తమిళ నిర్మాతల మండలి ఆఫర్ ఇచ్చింది. కానీ వాళ్లు ఏ నిర్ణయం చెప్పలేదు. ఇక గత నెలన్నరగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన సినిమాల్ని వచ్చే రెండు నెలల్లో క్లియర్ చేయడానికి తమిళ నిర్మాతల మండలి సంప్రదింపులు జరుపుతోంది. ఏప్రిల్ 27న రిలీజ్ కావాల్సిన ‘కాలా’.. మేలో విడుదల చేయాల్సి ఉన్న ‘విశ్వరూపం-2’ సినిమాల విషయంలో తాము చేసేదేమి లేదని.. వాళ్ల సౌలభ్యాన్ని బట్టి రిలీజ్ డేట్ ఖరారు చేసుకోవచ్చని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ అన్నాడు.