Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : యశ్‌.. కోహ్లీ ఫ్యాన్స్ మనో వేదనకు ఇదే సాక్ష్యం

By:  Tupaki Desk   |   14 March 2022 10:00 PM IST
పిక్‌ టాక్‌ : యశ్‌.. కోహ్లీ ఫ్యాన్స్ మనో వేదనకు ఇదే సాక్ష్యం
X
భారత దేశంలో సినిమా స్టార్స్ కి మరియు క్రికెటర్ లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా స్టార్స్ ను మరియు క్రికెటర్స్ ను దేవుళ్లుగా ఇండియన్‌ జనాలు పూజిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్‌ హీరోలను మరియు క్రికెటర్లను నెత్తిన పెట్టుకొని మరి అభిమానించే కోట్లాది మంది అభిమానులు మన దేశం లో ఉన్నారు.

అయితే ఆ అభిమానులకు అప్పుడప్పుడు వారు అభిమానించే స్టార్స్ పైన కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళు సినిమా స్టార్స్ అయినా సరే.. క్రికెటర్స్ అయినా సరే అప్పుడప్పుడు అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఎన్నో సార్లు హీరోల సినిమా లు తాము అనుకున్న స్థాయిలో లేకపోతే విమర్శించడం.. లేదంటే తాము కోరుకున్న సినిమా అప్డేట్ ని ఇవ్వకపోతే కోపం తెచ్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక క్రికెటర్ల విషయానికి వస్తే సరైన ఫామ్‌ ను కనబర్చకుంటే.. ఆట తీరును కనబర్చుకుంటే కచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మ్యాచ్ లో సెంచరీ కొడతాడు అనుకున్న క్రికెటర్ కేవలం ఐదు పది పరుగులకే ఔట్‌ అయితే అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఇండియా శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఆ టెస్ట్ సిరీస్ లో భాగంగా బెంగళూరులో మ్యాచ్ జరుగుతోంది.

బెంగళూరు మ్యాచ్ కి హాజరైన సినీ క్రికెట్ అభిమానులు ఒక ఫ్లెక్సీని పట్టుకొని తన నిరసనను తెలియజేశారు. ఒకే ప్లెక్సీలు తన అభిమాన హీరో యశ్‌ మరియు తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ ల కు సంబంధించిన విషయాన్ని చూపించాడు. ఆ ప్లెక్సీ లో ఈ విధంగా ఉంది.... హీరో యశ్‌ ని వెండి తెరపై చూసి 1178 రోజులు అయింది. ఆయన కే జి ఎఫ్ సినిమా విడుదలయ్యి ఇన్నాళ్లు అవుతున్నా కేజిఎఫ్ 2 మాత్రం ఇంకా రాలేదు అంటూ అభిమానులు ఆవేదనతో ఈ ఫ్లెక్సీని ప్రదర్శించడం జరిగింది.

ఇంకా అదే ప్లెక్సీ లో విరాట్ కోహ్లీ గురించి స్పందిస్తూ.. కోహ్లీ బ్యాట్‌ నుండి సెంచరీ చూడక 837 రోజులు అయ్యింది. ప్రపంచ క్రికెట్ కింగ్ కోహ్లీ నుండి ఇన్నాళ్లు అయినా టెస్టు సెంచరీ చూడక పోవడం ఆవేదన కలిగిస్తోంది అంటూ కోహ్లీ అభిమానులు ఈ బ్యానర్ ద్వారా చెప్పకనే చెప్పారు.

మొత్తానికి దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న రెండు విషయాలను ఈ సింపుల్ గా ఈ బ్యానర్లో చూపించి అందరి దృష్టిని ఆకర్షించారు. కేజీఎఫ్‌ సినిమా వచ్చే నెలలో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లీ బ్యాట్‌ నుండి ఈ సీజన్‌ లో సెంచరీ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.