Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ మేకర్స్‌ ముందు చూపు

By:  Tupaki Desk   |   30 July 2020 10:15 AM IST
కేజీఎఫ్‌ మేకర్స్‌ ముందు చూపు
X
ఈ మద్య కాలంలో ప్రముఖ చిత్రాల పోస్టర్స్‌ చాలా వరకు కూడా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘రాధే శ్యామ్‌’ చిత్రం పోస్టర్‌ కూడా కాపీ అంటూ విమర్శలు వచ్చాయి. అంతకు ముందు కొన్ని బాలీవుడ్‌ పోస్టర్స్‌ కూడా కాపీ అంటూ విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో కేజీఎఫ్‌ మేకర్స్‌ ముందు చూపుతో తమ పోస్టర్‌ కు సంబంధించిన విషయాన్ని చెప్పి కాపీ విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు. సంజయ్‌ దత్‌ బర్త్‌ డే సందర్బంగా కేజీఎఫ్‌ 2 లో అధీరా లుక్‌ ను రివీల్‌ చేయడం జరిగింది. సంజయ్‌ దత్‌ లుక్‌ వైకింగ్స్‌ ను పోలి ఉండటంతో ముందుగానే కేజీఎఫ్‌ మేకర్స్‌ ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు.

కేజీఎఫ్‌ 2 చిత్రంలో సంజయ్‌ దత్‌ లుక్‌ ను వైకింగ్స్‌ తెగ ఆధారంగా డిజైన్‌ చేసినట్లుగా పేర్కొన్నారు. ఎనిమిదవ శతాబ్దంకు చెందిన వైకింగ్స్‌ తెగను ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. కనుక ఈ లుక్‌ విడుదల అయిన వెంటనే అంతా కూడా వైకింగ్స్‌ కు కాపీ అంటూ ట్రోల్స్‌ చేసే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో ముందు చూపుతో చిత్ర దర్శకుడు అసలు విషయాన్ని చెప్పేశారు. వైకింగ్స్‌ తెగకు చెందిన వారి లుక్‌ తో అధీరాను చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో తాము ఈ ప్రయత్నం చేశామని ముందస్తుగానే ప్రకటించారు.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను అక్టోబర్‌ లో విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచి పోవడంతో ఆలస్యం అవ్వనుంది. వచ్చే నెలలో షూటింగ్‌ ను ప్రారంభించి ఈ ఏడాది చివరి వరకు అయినా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే కేజీఎఫ్‌ 2 చిత్రం విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.