Begin typing your search above and press return to search.

మెగా ఫెస్టివల్ చేసిపారేశారంతే

By:  Tupaki Desk   |   16 Oct 2015 10:14 AM IST
మెగా ఫెస్టివల్ చేసిపారేశారంతే
X
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే తో మొదలైన మెగా ఫెస్టివల్.. ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. బ్రూస్ లీగా రామ్ చరణ్ రాకతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసేస్తున్నారు. అయితే.. ఇన్ని రోజులు పండగ కంటిన్యూ అవడానికి మధ్యలో చాలానే ఎపిసోడ్స్ ఉన్నాయి.

ఆగస్ట్ 22న చిరు బర్త్ డే వేడుకలు - సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి మెగా ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. ఈ డేట్స్ లో మెగా ఫ్యామిలీకి చెందిన మూవీస్ కి ఫస్ట్ లుక్స్ - టీజర్స్ - ట్రైలర్స్ తో దుమ్ము దులిపేశారు. వీటిలో పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. ఆ తర్వాత సెప్టెంబర్ 23న వచ్చాడండీ.. తేజు. అదేనండీ సుబ్రమణ్యం ఫర్ సేల్ తో సాయిధరం తేజ్. ఈ మెగా మేనల్లుడు చిరు - పవన్ లను ప్రతీక్షణం గుర్తు చేసేసి, థియేటర్స్ లోనే పండగ వాతావరణం సృష్టించేశాడు. నెక్ట్స్ ఎపిసోడ్ అల్లు అర్జున్ ది. రుద్రమదేవి మూవీలోకి లేట్ గా ఎంట్రీ ఇచ్చినా.. మొత్తం మూవీకే బ్యాక్ బోన్ అయిపోయాడు. బన్నీ చేసిన గోన గన్నారెడ్డి రోల్ కోసమైనా సినిమా ఓసారి చూడాలని జనాలను అనుకునేటంతగా ఇరగదీసేశాడు.

ఇప్పుడు వంతు రామ్ చరణ్ ది. మెగాస్టార్ కేమియోతో.. ఇక్కడతో మెగా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ టాప్ రేంజ్ కి వెళ్లిపోయాయి. అయితే.. ఈ వేడుకలు ఇంకా కంప్లీట్ అవలేదు. అక్టోబర్ 2న న రావాల్సిన వరుణ్ తేజ్ కంచె.. అఖిల్ వాయిదా కారణంగా ఆ డేట్ ని ఫిక్స్ చేసేసుకున్నాడు. మొత్తానికి ఫంక్షన్లు - టీజర్లు - ట్రైలర్ లతో ఒకనెల... మూవీ రిలీజ్ లతో మరో నెల రోజులను మెగా ఫెస్టివల్ చేసిపారేశారంతే.