Begin typing your search above and press return to search.
ట్రెండింగ్: తొడ కొట్టిన బాలయ్య..చరణ్ వెనక్కు
By: Tupaki Desk | 18 Jan 2019 1:11 PM ISTసోషల్ మీడియాలో ఈమద్య కాలంలో మీమ్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్ - బోయపాటిల వినయ విధేయ రామ చిత్రం పై సోషల్ మీడియాలో వచ్చిన ట్రెండ్స్ సినిమా కలెక్షన్స్ ను తారు మారు చేశాయి. మొదటి రోజు భారీగా వసూళ్లు వచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత రోజు నుండి సోషల్ మీడియాలో సినిమా పై జోకులు పెద్ద ఎత్తున పేళ్లాయి. ముఖ్యంగా బోయపాటి యాక్షన్ సీన్స్ ను నెటిజన్స్ ఒక ఆట ఆడేసుకున్నారు.
వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ గుజరాత్ లో విమానాశ్రయం గ్లాస్ బద్దలు కొట్టుకుని - ట్రైన్ పై దూకుతాడు. గుజరాత్ నుండి బీహార్ వరకు కూడా రామ్ చరణ్ అలా ట్రైన్ పైనే జర్నీ చేసి వస్తాడు. ఆ సీన్ ను జనాలు పిచ్చ కామెడీగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోను బాలయ్య వీడియోతో జత చేసి ఒక ఫన్నీ మీమ్ వీడియోను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
రామ్ చరణ్ వీరావేశంగా ట్రైన్ టాప్ పై నిల్చుని వస్తూ ఉంటాడు. అప్పుడే బాలకృష్ణ జై చెన్నకేశవా అంటూ తొడ కొట్టి వేలు చూపిస్తే చరణ్ ట్రైన్ వెనక్కు వెళ్లి పోతుంది. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియా జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో కాని, సోషల్ మీడియాలో జనాలు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి చరణ్ 'వినయ విధేయ రామ' మరియు బాలకృష్ణ 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రెండు సినిమాలు కూడా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఎన్టీఆర్ కు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆశించినంతగా రాలేదనే విషయం తెల్సిందే.