Begin typing your search above and press return to search.

ఇందిరానగర్ గుండాను.. కెప్టెన్ కూల్ యాంగ్రీ అవతార్ పై మీమ్స్

By:  Tupaki Desk   |   10 April 2021 10:43 AM GMT
ఇందిరానగర్ గుండాను.. కెప్టెన్ కూల్ యాంగ్రీ అవతార్ పై మీమ్స్
X
టీమిండియా మాజీ కెప్టెన్.. మిస్ట‌ర్ కూల్ రాహుల్‌ ద్రవిడ్ ఓపిక స‌హ‌నం గురించి అభిమానులు ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. మైదానంలో ఎంత శాంతంగా ఉంటాడో ప్ర‌త్య‌ర్థిని ఎలా ఎదుర్కొంటారో తెలిసిన‌దే. కానీ ఆయ‌న శాంతాన్ని కోల్పోయారు. నేను ఇందిరాన‌గ‌ర్ గూండాను! అంటూ.. కోపంతో ఊగిపోయారు. త‌న చేత్తో బ్యాట్ ప‌ట్టుకుని కార్ అద్దాల్ని ప‌గ‌ల‌గొట్టారు. అయితే ఆయ‌న అంత‌గా ఊగిపోవ‌డానికి కార‌ణ‌మేమిటో తెలియాలంటే కాస్త వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ది గ్రేట్ వాల్ రాహుల్ అంద‌రిపైకి గ‌ట్టిగా అరుస్తూ ఆగ్ర‌హంతో ఊగిపోతూ అస‌లు ఈ విన్యాసం దేనికోసం అంటే ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న కోసం మాత్ర‌మే. అత‌డు నిజ జీవితంలో ఎప్పుడూ కూల్ మ్యాన్. తాజాగా రిలీజైన ఈ ప్ర‌క‌ట‌న వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇది CRED ప్రకటన. దీనికోసం రాహుల్ ద్రవిడ్ `ఇందిరానగర్ కా గుండా`గా మారారు.

క్రికెట్ లో జెంటిల్ మన్ ప్లేయ‌ర్ ఉన్న‌ట్టుండి అలా `ఇందిరానగర్ కా గుండా` బిరుదు సంపాదించడం అభిమానుల్లో ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అది కూడా క్రెడిట్ కార్డ్ చెల్లింపు సాధ‌నం CRED చేసిన ప్రకటనలో అత‌డు అలా న‌టించారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ద్రవిడ్ లోని మ‌రో కోణాన్ని పరిచయం చేసింది. బెంగళూరు లోని ర‌ద్దీకూడ‌లి ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నందుకు కోపంతో ఊగిపోయిన ద్ర‌విడ్ న‌ట‌న ఆక‌ట్టుకుంది.

ఈ ప్రకటన సోషల్ మీడియాలో క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యింది. ద్ర‌విడ్ అభిమానులు అనుచరుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఈ ప్ర‌క‌ట‌న‌కు అభిమానులంతా అన్ లిమిటెడ్ గా మీమ్స్ ను షేర్ చేస్తూ వీడియోని వైర‌ల్ చేస్తున్నారు. ద్రవిడ్ కొత్త అవ‌తారంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ప్ర‌స్తుత టీమిండియా కెప్టెన్ కోహ్లీ దీనిపైన ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. మొత్తం క్రికెట్ ప్ర‌పంచ‌మే ద్ర‌విడ్ లో న్యూవెర్ష‌ణ్ చూసి షాక్ తింటోంది అంటూ వ్యాఖ్యానించారు.