Begin typing your search above and press return to search.

రెండు ఫోటోలు ఒకటే ఎమోషనల్!

By:  Tupaki Desk   |   4 May 2020 4:00 PM GMT
రెండు ఫోటోలు ఒకటే ఎమోషనల్!
X
కరోనా మహమ్మారి కారణంగా గత 40 రోజులుగా క్లోజ్ లో ఉన్న వైన్ షాప్స్ నేడు కొన్ని చోట దేశ వ్యాప్తంగా తెరుచుకున్నాయి. మూడోదశ లాక్ ‌డౌన్‌ లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. దేశంలోని పలు రాష్ట్రాలు లిక్కర్ షాపులు తెరిచేందుకు అనుమతులు మంజూరు చేసాయి. దీనితో సోమవారం తెల్లవారు జామునుండే వైన్ షాప్స్ ముందు మందుబాబులు బారులు తీరారు.

మద్యం దుకాణాలు తెరవడంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేవు అని చెప్పవచ్చు. దీనితో నిన్నటివరకు నిరసంగాకనిపించిన మందుబాబులు ఇప్పుడు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. కొందరు వైన్స్ ‌ల ఎదుట కొబ్బరికాయలు కొడితే - మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా బాణాసంచా కాల్చారు. కొన్ని చోట్ల మగవారితో పాటుగా యువతులు కూడా మద్యం కోసం వైన్ షాప్ ల ముందు క్యూ లైన్ లో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో ట్రోల్స్ మొదలైయ్యాయి.

తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఒక ఫోటోలో ఏ ఆర్ రెహమాన్ తాను సాధించిన ఆస్కార్ అవార్డులను గర్వంగా చూపుతుండగా ..మరో ఫోటోలో మద్యం బోటిల్ చేతిలో పడిన ఓ వ్యక్తి అంతే గర్వంగా నేను సాధించాను అనేలా మద్యం బాటిళ్లు ఎత్తి చూపాడు దీంతో 'రెండు ఫోటోలు ఒకటే ఎమోషనల్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.