Begin typing your search above and press return to search.

రామారావు మరో మరో మెలోడీ తో రెడీ

By:  Tupaki Desk   |   5 May 2022 12:09 PM GMT
రామారావు మరో మరో మెలోడీ తో రెడీ
X
రవితేజ హీరోగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా వచ్చే నెల 17న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. దర్శకుడు శరత్‌ మండవ కొత్తవాడు అయినా కూడా సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ చేయడంలో సక్సెస్ అయ్యాడు. రవితేజ వరుసగా సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద దాడికి సిద్దం అయ్యాడు. ఖిలాడీ సినిమాతో మొదలు పెట్టిన ఈ బాక్సాఫీస్ దాడిలో భాగంగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మరోసారి సత్తా చాటబోతున్నాడు.

రవితేజ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా అతి త్వరలో విడుదల కాబోతున్న ఈ సమయంలో బ్యాక్ టు బ్యాక్ పాటలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుండి సొట్టల బుగ్గలో అనే మెలోడీ పాటతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మాస్ తో పాటు క్లాస్ మెలోడీ ఏదైనా కూడా రవితేజ సినిమాకు ప్రధాన ఆకర్షణగా పాటలు ఉంటాయి. కనుక ఈ పాట తప్పకుండా రామారావు ఆన్ డ్యూటీ స్థాయిని పెంచే విధంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. రవితేజ వరుసగా సినిమాల్లో చేస్తున్న ఈ సమయంలో ప్రతి సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ముగింపు దశకు వచ్చిందని తెలుస్తోంది.

శరత్‌ మండవ ఈ సినిమాలో రవితేజను ఒక గవర్నమెంట్‌ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ తో పాటు మరో హీరోయిన్ గా రజిష విజయన్ కూడా కనిపించబోతుంది. ఇద్దరు హీరోయిన్స్ తో రవితేజ సందడి చేసే తీరు కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా సమ్మర్‌ చివర్లో సందడికి సిద్దం అయ్యింది.

రవితేజ తదుపరి సినిమాల విషయానికి వస్తే ధమాకా సినిమా ఇప్పటికే త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్నాడు. అదే కాకుండా రాక్షసుడు సినిమాను కూడా ఆయన చేస్తున్న విషయం తెల్సిందే. వీటన్నింటితో పాటు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాను కూడా రవితేజ చేస్తున్నాడు. ఇన్ని సినిమాలు చేస్తూ కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరన్న సినిమాలో కీలక పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు.