Begin typing your search above and press return to search.

మంచు వారి అమ్మాయిలు.. మొదటి సారి ఇలా..

By:  Tupaki Desk   |   24 July 2022 12:43 PM GMT
మంచు వారి అమ్మాయిలు.. మొదటి సారి ఇలా..
X
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు జిన్నా సినిమా ద్వారా ఎలాగైనా మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు.నిర్మాతగానే కాకుండా హీరోగా కూడా చాలావరకు ఫ్లాప్స్ చూసిన మంచి విష్ణు జిన్నా సినిమాపై కాస్త నమ్మకంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఈ సినిమా కోసం ప్రముఖ రచయితలు వర్క్ చేశారు. జి నాగేశ్వర్ రెడ్డి తో పాటు కోన వెంకట్ ఈ సినిమా కథ విషయంలో చాలా చర్చలు జరిపి మంచు విష్ణు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మార్చినట్లుగా తెలుస్తోంది.

జిన్నా సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ కూడా బాగానే హెల్ప్ అవుతున్నాయి. ఇక మొదటిసారి ఒక భిన్నమైన పాటను విడుదల చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. సూర్య అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ కథానాయికలుగా నటించారు.

ఇక ఈరోజు ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఫ్రెండ్షిప్ అనే ఈ సాంగ్ లో మంచు విష్ణు కుమార్తెలు అరియానా మంచు, వివియానా మంచు కనిపించారు. ఇక వారిద్దరూ ఈ పాటను పాడడం మరో ఆసక్తికరమైన విషయం. అనూప్ రూబెన్స్ ట్రాక్ కంపోజ్ చేయగా, భాస్కర్ భట్ల మంచి సాహిత్యాన్ని రాశారు.

ఇక పాటలో మంచు వారి అమ్మాయిలతో చేసిన ప్రయోగం కూడా సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సినిమాను సింపుల్ గా కంపోజ్ చేశారు. ఇక త్వరలోనే రెండవ సాంగ్ ను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. సన్నీ లియోన్ తో ఉండే ఆ పాటను ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కూడా చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.