Begin typing your search above and press return to search.

'తెల్లవారితే గురువారం' నుంచి బ్యూటిఫుల్ 'మెల్లగా మెల్లగా' సాంగ్..!

By:  Tupaki Desk   |   19 March 2021 2:04 PM GMT
తెల్లవారితే గురువారం నుంచి బ్యూటిఫుల్ మెల్లగా మెల్లగా సాంగ్..!
X
'మత్తు వదలరా' ఫేమ్ శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''తెల్లవారితే గురువారం''. చిత్రా శుక్లా - మిషా నారంగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణికాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం - లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'మెల్లగా మెల్లగా' అనే పాటని రిలీజ్ చేశారు.

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ పాటని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ అందజేశారు. 'మెల్లగా మెల్లగా.. దారులే మారినా.. కొత్తగా కొత్తగా పయణమే చూపినా' అంటూ సాగిన ఈ గీతానికి కాలభైరవ స్వరాలు సమకూర్చారు. అంతేకాదు సింగర్ సాహితీ చాగంటి తో కలిసి ఆలపించారు. 'నిన్నటి ఆశే మాని.. రేపటి ఊసే లేని ఆ క్షణమే ఎదురైందా' అంటూ సాంగ్ మూడ్ కి తగ్గట్టు లిరిసిస్ట్ రఘురామ్ సాహిత్యం అందించారు. మరోసారి కాలభైరవ బ్యూటిఫుల్ అండ్ ఫ్రెష్ ట్యూన్ తో పాటు తన గాత్రంతో శ్రోతలను ఆకట్టుకున్నాడు.

కీరవాణి తనయులు ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ మ్యూజికల్ మ్యాజిక్ థియేటర్స్ లో ఎలాంటి సౌండింగ్ చేస్తుందో చూడాలి. 'తెల్లవారితే గురువారం' చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల - సత్య - అజయ్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు. ఇకపోతే మార్చి 21న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారు.