Begin typing your search above and press return to search.

డాన్ దావూద్ లవర్ బండారం బయటపడుతోంది

By:  Tupaki Desk   |   28 Aug 2020 11:02 PM IST
డాన్ దావూద్ లవర్ బండారం బయటపడుతోంది
X
ముంబై మాఫియా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రేయసిగా పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చిన మెహ్వీష్ హయత్ నోటిదురుసు.. వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు మీడియాలో కథలు కథలుగా వార్తలు బయటకు వస్తున్నాయి. గతంలో ఈమె ప్రియాంకచోప్రా, షారుక్ ఖాన్ పై నోరు పారేసుకుందని చెబుతున్నారు.

పాకిస్తాన్ నటి మెహ్వీష్ హయత్ కు సినీ కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె తల్లి టెలివిజన్ నటి కాగా.. సోదరుడు మ్యూజిక్ డైరెక్టర్. సోదరి గాయకురాలే..అన్నయ్య నటుడు. ఇలా పాక్ సినీ పరిశ్రమలో మెహ్వీష్ బలమైన నేపథ్యం ఉంది. అయితే సక్సెస్ కాలేకపోయింది.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఎఫైర్ కారణంగానే పాక్ సినీ ఇండస్ట్రీలో భారీ ఆఫర్లను మెహ్వీష్ దక్కించుకుందనే ప్రచారం ఉంది. అందుకే ఐటం గర్ల్ గా తన సినీ కెరీర్ ఆరంభించిన మోహ్విష్ హయత్ కు పాకిస్తాన్ పౌరపురస్కారమైన ‘తమ్గా ఇంతియాస్’ 2019లో లభించిందని ఆరోపించాయి. ఎందుకంటే అంతగా పాకిస్తాన్ సినీ పరిశ్రమకు తెలియని ఆమెకు ఆ అవార్డు దక్కడం వెనుక దావూద్ ఇబ్రహీం లాబీయింగ్ ఉందని సినీ పరిశ్రమ ఆరోపణ..

పాకిస్తాన్ లోని బాలాకోట్ దాడులను సమర్థించిన ప్రియాంక చోప్రాపై మెహ్వీష్ గతంలో నోరుపారేసుకుంది. యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ కామెంట్ చేసింది.ఇక పాకిస్తాన్ కు వ్యతిరేకంగా రూపొందిన వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసిన షారుఖ్ ఖాన్ పై కూడా ఆడిపోసుకుంది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావ్ అంటూ షారుఖ్ పై మండిపడింది.

ప్రస్తుతం దావూద్ తన కంటే 27 ఏళ్లు చిన్న అయిన మెహ్వీష్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని వార్తలు వెలుగులోకి రావడంతో మాఫియా డాన్ ఆరాతీస్తున్నట్టు తెలిసింది. ఈ వార్తలపై ఆగ్రహంగా ఉన్నట్టు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.