Begin typing your search above and press return to search.

ఆ పిల్లని హీరోయిన్ అనుకోలేదా??

By:  Tupaki Desk   |   8 Aug 2017 4:55 PM GMT
ఆ పిల్లని హీరోయిన్ అనుకోలేదా??
X
ఒక్కోసారి భలే గమ్మతయిన విషయాలు జరుగుతుంటాయి. కొంతమంది నిజంగానే స్టార్లను చూసినా కూడా వారిని గుర్తుపట్టలేరు. అయితే అది మేకప్ లేకుండా కనిపించిన స్టార్లకే కాదు.. మేకప్ వేసుకుని కనిపించిన హీరోయిన్లను కూడా ఒక్కోసారి ఎవ్వరూ గుర్తుపట్టరు.

నిన్న జరిగిన వోవెన 2017 ఫ్యాషన్ షో కోసం సమంత బ్రాండ్ అంబాసిడర్ హోదాలో రాగా.. అక్కడకు చాలామంది సెలబ్రిటీలు విచ్చేసి ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసేశారు. అందులో ముఖ్యంగా హీరోయిన్లు క్యాథరీన్ త్రెసా.. అనూ ఎమ్మానుయేల్.. అదా శర్మ.. రీతూ వర్మలు.. ర్యాంప్ పై హొయలు ఒలికించారు. అయితే అక్కడ నడిచిన మిగతా అందరూ మోడల్సే. వారి ఫోటోలు పెద్దగా ఎక్కడా కనిపించవులే. కాకపోతే విషయం ఏంటంటే.. ఇదే ర్యాంపులో మెహ్రీన్ కౌర్ కూడా ర్యాంప్ వాక్ చేసింది. కృష్ణ గాడి వీర ప్రేమగాధ హీరోయిన్ తన కాంటాక్ట్స్ తో టాలీవుడ్ లో ఓ నాలుగైదు సినిమాలను పట్టేసింది కాని.. ర్యాంప్ మీద నడుస్తూ తాను ఒక హీరోయిన్ అని అనిపించుకోలేక పోయింది. ఒకవేళ అనిపించుకునుంటే మనోళ్ళు ఫోటోలు క్లిక్ చేసి ఈపాటికే అన్ని చోట్లా అరేసేవారుగా అంటున్నారు నెటిజన్లు.

ఇక లేటుగా ఈమె ఫోటోలు బయటకు వస్తుంటే.. అరే ఈమె ఆ హీరోయిన్ కదూ అంటూ అందరూ నోరెళ్ళబెట్టారు. వోవెన్ కార్యక్రమం సోమవారం సాయంత్రం జరిగితే.. మంగళవారం సాయంత్రం వరకు ఆ కార్యక్రమానికి మెహ్రీన్ కూడా వచ్చిందని ఎవ్వరికీ తెలియలేదని టాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది సంగతి.