Begin typing your search above and press return to search.

డార్లింగ్ కోసం హనీ బ్యూటీ ట్రాప్!

By:  Tupaki Desk   |   8 Feb 2022 3:30 PM GMT
డార్లింగ్ కోసం హనీ బ్యూటీ ట్రాప్!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `బాహుబ‌లి` స‌క్సెస్ త‌ర్వాత‌ బాలీవుడ్ హీరోయిన్లే డార్లింగ్ కోసం క్యూ క‌డుతున్నారు. మేక‌ర్స్ డార్లింగ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అంత‌కు మించి ఆలోచ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికే `ప్రాజెక్ట్ కె` లో ప్ర‌భాస్ స‌ర‌స‌న దీపికా ప‌దుకొణే న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లను ప‌రిశీలించారు. చివ‌రిగా దీపికా ప‌దుకొణేని లాక్ చేసారు. ఆమెకు భారీగా పారితోషికం ఆఫ‌ర్ చేసి దించుతున్నారు. దాదాపు ప‌దికోట్లు దీపికా ప‌దుకోణెకి పారితోషికం రూపంలో అందిస్తున్నారు.

ఇక ప్ర‌భాస్ బాలీవుడ్ డెబ్యూ `ఆదిపురుష్` లో కృతి స‌న‌న్ న‌టిస్తోంది. `స‌లార్` లో శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. ఇలా ప్ర‌భాస్ న‌టిస్తోన్న ఆన్ సెట్స్ చిత్రాలన్నింటిలో స్టార్ హీరోయిన్లే న‌టిస్తున్నారు. అయితే ఇంత‌టి ట‌ఫ్ కాంపిటీష‌న్ న‌డుమ మెహ‌రీన్ పిర్జాదా డార్లింగ్ తో ఛాన్స్ కోసం విశ్వ ప్ర‌య‌త్నాలే చేస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడి మారుతి రాజా డీల‌క్స్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందులో హీరోయిన్ గా ఎవ‌ర్ని తీసుకుంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఆఛాన్స్ త‌న‌కే ద‌క్కేలా మెహ‌రీన్ లాబింగ్ చేస్తున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

మారుతితో రెగ్యుల‌ర్ టచ్ లో ఉంటోందిట‌. అవ‌కాశం ఉంటే క‌ల్పించాల‌ని ఓ మాట కూడా ముందొస్తుగా వేసిన‌ట్లు స‌మాచారం. నేరుగా ప్ర‌భాస్ తో ఛాన్స్ అన‌కుండా మారుతిని ఇలా లాక్ చేయాల‌ని ప్ర‌ణాళిక వేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ గ‌తంలో మారుతి తెర‌కెక్కించిన `మ‌హానుభావుడు`..`మంచిరోజులొచ్చాయి` సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అప్ప‌టి నుంచి మారుతితో స్నేహం ఉంది. ఇప్పుడా స్నేహాన్ని ఇలా వినియోగించుకోవాల‌ని చూస్తుంది. అయితే అదంత వీజీ కాదు. పాన్ ఇండియా స్టార్ కాబ‌ట్టి ఆ రేంజ్ హీరోయిన్ ని తీసుకునే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కూ మెహ‌రీన్ టాప్ స్టార్స్ స‌ర‌స‌న న‌టించ‌లేదు. మీడియం రేంజ్ హీరోల‌తోనే న‌టించింది. అయితే రాజా డీల‌క్స్ లో సెకెండ్ లీడ్ ఏమైనా ఉంటే మెహ‌రీన్ కి ద‌క్కే అవ‌కాశం ఉంది. ఈ ఛాన్స్ అయినా ద‌క్కితే మెహ‌రీన్ కి గేమ్ ఛేంజ‌ర్ అవుతుంది. ప్ర‌స్తుతం మెహ‌రీన్ `ఎఫ్ -3` లో న‌టిస్తోంది. అలాగే మ‌రో రెండు త‌క్కువ బ‌డ్జెట్ చిత్రాలు చేతిలో ఉన్నాయి.