Begin typing your search above and press return to search.

ఆ హీరో గ్రేట్.. హీరోయిన్ సర్టిఫికేట్

By:  Tupaki Desk   |   7 Aug 2017 5:57 AM GMT
ఆ హీరో గ్రేట్.. హీరోయిన్ సర్టిఫికేట్
X
"కృష్ణ గాడి వీర ప్రేమ గాధ" సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మెహ్రీన్ కౌర్ పిర్జాద తన మొదటి సినిమాతోనే కుర్రకారు మనస్సులను దోచేసుకుంది. ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత ఆఫర్లను బాగానే అందుకుంది. అయితే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఒకే చేస్తోందట మెహ్రీన్. ప్రస్తుతం తెలుగులో "రాజా ది గ్రేట్" సినిమాలో నటిస్తోన్న ఈ హీరోయిన్ తన సహా నటుడైన రవితేజ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

మెహ్రిన్- రవి తేజ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసే వ్యక్తి. సెట్ లో కూడా అందరితో సరదాగా.. ఉంటూ తనదైన శైలిలో నవ్విస్తుంటాడు. చాలా నిజాయితీగాల మనిషి అంటూ..రవితేజని ఆకాశానికి ఎత్తేసింది. ముఖ్యంగా డార్జిలింగ్ పరిసరాలలో షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలో అక్కడ పరిస్థితులు అంతగా బాగోలేవు.. కానీ రవితేజ ఏ మాత్ర టెన్షన్ లేకుండా ఉండడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ కేసు వేళ.. మెహ్రీన్ తన హీరోకు ఇస్తున్న సర్టిఫికేట్ కాస్త ఆసక్తిని రేకెత్తించిందిలే. ఇక "రాజా ది గ్రేట్" సినిమాలో తన పాత్ర చాలా అక్కటుకుంటుందని ఒక కాలేజ్ యువతిగా కనిపించనుందట అమ్మడు.

పటాస్, సుప్రీమ్ వంటి హిట్స్ అందుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి "రాజా ది గ్రేట్" సినిమాను తెరకెక్కిస్తుండగా దిల్ రాజు చాలా రోజుల తర్వాత రవితేజ సినిమాను నిర్మిస్తున్నాడు. వీరిద్దరి కలయికలో ఇంతకుముందు భద్ర సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇప్పటికే సగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.