Begin typing your search above and press return to search.

ఈ కొత్త హీరోయిన్ పరిస్థితి ఏంటో...

By:  Tupaki Desk   |   22 Jan 2016 1:30 AM GMT
ఈ కొత్త  హీరోయిన్ పరిస్థితి ఏంటో...
X
తెలుగు సినిమా ఇండస్ట్రీ పక్క రాష్ట్రాల నుంచి భామలను బాగానే తెచ్చుకుంటుంది. గతంలో ముంబై ముద్దుగుమ్మలకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్లు కానీ, ఈ మధ్య దేశం మొత్తంలో ఎక్కడి నుంచైనా పట్టుకొచ్చేస్తున్నారు. యాడ్స్ నుంచి, మోడలింగ్ నుంచి అన్ని చోట్ల నుంచి భామలను దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా గతేడాది టాలీవుడ్ కి కొత్త హీరోయిన్లు చాలా మందే వచ్చారు. కానీ క్లిక్ అయిన వారు, హిట్ కొట్టి నిలబడ్డ వారు మాత్రం కనిపించ లేదు.

అఖిల్ మూవీలో సాయేషా సైగల్, అబ్బాయితో అమ్మాయి సినిమాలో పాలక్ లల్వాని, లోఫర్ తో దిశా పటానీ.. వీళ్లంతా చివరి మూడు నెలల్లో అదృష్టం పరీక్షించుకున్నవారే. కానీ ఒక్కరికీ హిట్ దక్కలేదు. కనీసం మరో ఆఫర్ రాలేదు. కానీ 2016 ప్రారంభంలో వచ్చిన నేను.. శైలజ హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం ఆ మూవీ విడుదలకు ముందే ఆఫర్స్ పట్టేసింది. రీసెంట్ గా ఎక్స్ ప్రెస్ రాజా హిట్ అవడంతో సురభి పొజిషన్ కూడా బాగానే ఉంది.

ఇప్పుడు నానితో కలిసి కృష్ణగాడి వీర ప్రేమగాధతో వస్తోంది మెహరీన్‌ కౌర్‌ పీర్జాదా. ఈమెకు టాలీవుడ్ అచ్చి రావాలంటే, ఖచ్చితంగా ఆ సినిమా పెద్ద హిట్ కావాల్సి ఉంటుంది. అయితే, డైరెక్టర్ హను రాఘవపూడికి మాత్రం ఈ విషయంలో మంచి అనుభవమే ఉంది. అందాల రాక్షసితో కమర్షియల్ సక్సెస్ కొట్టకపోయినా, హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. సో.. ఈ అమ్మడికి కూడా టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ తలుపుతట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంచనా.