Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రాజాతో డార్జీలింగ్ లో డార్లింగ్

By:  Tupaki Desk   |   13 April 2017 4:16 AM GMT
ఫోటో స్టోరి: రాజాతో డార్జీలింగ్ లో డార్లింగ్
X
మాస్ రాజా రవితేజ చాలా గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు రెండు సినిమాలకు ఓకె చెప్పిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి కొత్త దర్శకుడు తీస్తున్న 'టచ్ చేసి చూడు' అయితే.. రెండోది 'రాజా ది గ్రేట్' సినిమా. ఈ రెండో దాంట్లో మనోడు ఒక గుడ్డివాడి క్యారెక్టర్లో నటిస్తున్నాడు. అసలు హీరోకు కళ్లు కనిపించవవు.. చూపు లేదు.. అంటే కాస్త షాకింగే కాని.. రవితేజ మాత్రం చాలా డేరింగ్ గా ఈ రోల్ ఒప్పుకున్నాడు.

అనిల్ రావిపూడ్ డైరక్షన్లో రూపొందుతన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డార్జీలింగ్ హిల్ స్టేషన్లో జరుగుతోంది. చాలా సంవత్సరాల తరువాత ఒక తెలుగు సినిమా ఆ మంచు పర్వతాల్లో షూటింగ్ జరుపుకుంటోందనే చెప్పాలి. ఇకపోతే షూటింగ్ స్పాట్ నుండి డార్లింగ్ బ్యూటి మెహ్రీన్ కౌర్ పీర్జాదా తన హీరోతో కలసి ఒక సెల్ఫీ తీసుకుని.. అది అభిమానులతో షేర్ చేసింది. మొత్తానికి అసలు రవితేజ షూటింగులో పాల్గొంటున్నాడా లేదా అనే సందేహాలను ఈ హీరోయిన్ తొలిగించేసిందనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/