Begin typing your search above and press return to search.

దెబ్బకి దేవుడి దగ్గర తేలింది

By:  Tupaki Desk   |   22 May 2016 9:38 AM GMT
దెబ్బకి దేవుడి దగ్గర తేలింది
X
ఎవరైనా అంతే కదా.. అంతా అనుకున్నట్లు జరిగితే.. నా హార్డ్ వర్క్ ఫలించింది అంటున్నారు. లేదా అనుకున్నట్లు జరగకుండా.. సడన్ గా కలిసొస్తే.. అది దేవుడి మాయ అనేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఇలాగే తయారైంది. ఇక హీరోయిన్‌ మెహరీన్‌ కూడా అంతేనండోయ్‌. అమ్మడు కూడా ఇప్పుడు దేవుడి బాట పట్టేసింది.

''కృష్ణగాడి వీర ప్రేమ గాధ'' సినిమాతో తెరపైకి వచ్చింది ఈ హీరోయిన్‌. ఈ సినిమాను హిట్టంటూ అందరూ పొగిడేసినా.. పైనల్‌ గా కలక్షన్ల విషయంలో చతికిలపడింది. అందుకే మెహరీన్‌ కు అవకాశాలు రావడం అనేది బాగా కష్టమైపోయింది. ఇకపోతే అమ్మడు బొద్దుగా ఉండటం.. రొటీన్‌ స్టార్‌ హీరోయిన్లలా ఛమక్కుమనే లుక్కులు లేకపోవడం కూడా మైనస్సే అని చెప్పొచ్చు. ఇకపోతే చివరకు సాయిధరమ్‌ తేజ్‌ తో ఒక సినిమా.. అల్లు శిరీష్‌ తో ఒక సినిమా ఇచ్చి మెగా క్యాంపు బాగానే ఆదుకుంది. అందుకేనేమో ఇప్పుడు మెహరీన్‌ పూజలూ పునస్కారాలు అంటూ అమృతసర్‌ లో తేలింది.

గోల్డెన్‌ టెంపుల్‌ ను చేరుకున్న ఈ పిల్ల.. అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిందట. మొత్తానికి నాలుగు నెలల గ్యాప్‌ తరువాత రెండు ఛాన్సులు వచ్చి పడటంతో ఈ దైవ ప్రేమ పొంగి పొర్లిందనమాట.