Begin typing your search above and press return to search.

బాలయ్య ఫ్యాన్ సూపర్, కత్తి, కేక

By:  Tupaki Desk   |   18 Jan 2016 1:30 PM GMT
బాలయ్య ఫ్యాన్ సూపర్, కత్తి, కేక
X
నేచురల్ స్టార్ నానిని కృష్ణ గాడి వీర ప్రేమగాధ హీరోయిన్ తెగ పొగిడేస్తోంది. నాని తో కలిసి నటించడం తన అదృష్టం అని మెహ్రీన్ అంటోంది. ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న మెహ్రీన్.. ఈ మూవీ చేయడం తనకు చాలా అద్భుతమైన అనుభవం అంటూ చెప్పుకొస్తోంది. సెట్స్ కు వచ్చినపుడు తొలి రోజు కంగారుపడినపుడు, నాని చాలా హెల్ప్ చేశాడంటోంది ఈ పంజాబీ పాప. నాని నుంచి ఎంతో నేర్చుకున్నాని, ఆ నాలెడ్జ్ తో ఎంతో చక్కగా చేశానని చెప్పడమే కాదు.. తమ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని కూడా అంటోంది.

నాని యాక్టింగ్ ట్యాలెంట్ గురించి తెలిసి, రీసెంట్ గా వచ్చిన ఎవడే సుబ్రమణ్యం - భలే భలే మగాడివోయ్ చిత్రాలను స్పెషల్ గా చూసిందట కూడా. అవి అద్భుతంగా ఉన్నాయని, వాటిని చూశాక నానిపై గౌరవం మరింతగా పెరిగిందని చెప్పింది మెహ్రీన్. ఇక ఈగ మూవీ చూసిన తర్వాత.. నానికి ఫ్లాట్ అయిపోయిందట. అలాగే కృష్ణ గాడి వీర ప్రేమ గాధ డైరెక్టర్ హను రాఘవపూడికి కూడా కొన్ని పొగడ్తలు పంచింది ఈ హీరోయిన్. చాలా విజన్ ఉన్న వ్యక్తి అని, క్వాలిటీ లో కాంప్రమైజ్ కాకుండా తను అనుకున్న ఔట్ పుట్ వచ్చేవరకూ తాపత్రయపడతాడని అంటోంది.

మహాలక్ష్మి పేరున్నఓ పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓణీ గెటప్ లో చేసిన పాత్ర.. తనకు ఎంతో పేరు తెచ్చిపెడుతుందని ఆశలు పెట్టుకుంది ఈ భామ. ఇలా అందరినీ విపరీతంగా పొగిడేస్తున్న ఈ పంజాబీ సుందరి.. అదే ట్రిక్ తో బాగానే స్పీడ్ చూపిస్తోంది. ఇప్పటికే తెలుగులో రెండు, తమిళ్ లో ఒక ప్రాజెక్టుకు సైన్ చేసేసింది.