Begin typing your search above and press return to search.

ఇక చూస్కోండి నా సినిమాలు

By:  Tupaki Desk   |   28 Sep 2017 11:30 PM GMT
ఇక చూస్కోండి నా సినిమాలు
X
హీరోయిన్స్ క్లిక్ అయితే వరుసగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటూ ఏడాదికి ఓ రెండు మూడు సినిమాలైనైనా రిలీజ్ చేస్తుంటారు. అయితే ఏ హీరోయిన్ చేయని విధంగా మెహ్రీన్ పీర్జాదా చేస్తోంది. కృష్ణ గాడి వీర ప్రేమగాధ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ వరుసగా ఆఫర్స్ వచ్చాయి. తీరిక లేని బిజీ బిజీ షెడ్యూల్. ఒకేసారి నాలుగైదు షూటింగ్స్ లో పాల్గొంది. కానీ ఇంతవరకు రెండవ సినిమాను రిలీజ్ చెయ్యలేదు.

హీరోయిన్ గా చేసింది ఒక్క సినిమానే కానీ అమ్మడి అందానికి ఫిదా అయిపోయి దర్శక నిర్మాతలు బడా హీరోయిన్లను కూడా పక్కనపెట్టేశారు. అయితే ఆమె చేసిన మహానుభావుడు సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా అమ్మడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఈ సినిమాలో ఒక విలేజ్ నుంచి వచ్చిన ఐటి ఉద్యోగినిగా అమ్మడు కనిపించబోతుందట. ఆ పాత్ర పేరు మేఘన అని చెప్పింది. సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా చాలా బావుంటుంది. అతి శుభ్రత అనే లక్షణంతో ఉండే కుర్రాడు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ చుట్టూ సినిమా ఉంటుంది. ఇక మారుతి గారి డైరెక్షన్ సూపర్బ్ . కథ చెప్పగానే ఒకే చేశానని చెప్పుకొచ్చింది.

అలాగే కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై కూడా మెహ్రీన్ స్పందించింది. నేను ఏ సినిమాల నుంచి తప్పుకోలేదు. ఆ సినిమాలు నాకు సెట్ కావేమో అందుకే చేయలేదని సమాధానాన్ని ఇస్తూ.. ప్రస్తుతం చాలా మంచి సినిమాలను చేస్తున్నాను. ఇక నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ అవుతాయి చూస్కోండి అని చెప్పింది. ఇక రిజల్ట్ గురించి ఏ మాత్రం టెన్షన్ వెస్ట్ అంటూ.. ఓన్లీ ఎగ్జైటెడ్ గా ఉన్నాను అంటోంది. యాభై సినిమాలు తీసినా నా ప్రతి సినిమా నాకు మొదటి సినిమానే అని మెహ్రీన్ వివరణ ఇచ్చింది.