Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్.. ఇక మోతే

By:  Tupaki Desk   |   7 Sept 2017 6:00 AM IST
నాని హీరోయిన్.. ఇక మోతే
X
మెహ్రీన్ పిర్జాదా.. గత ఏడాది నాని హిట్ మూవీ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో పరిచయమైన పంజాబీ అమ్మాయి. ఆ సినిమాతో మంచి పేరొచ్చింది. లక్కీ హీరోయిన్ గానూ గుర్తింపు తెచ్చుకుంది. కానీ తొలి సినిమా విడుదలైన తర్వాత ఏడాదిన్నర పాటు ఆమె సినిమా ఇంకోటి రిలీజే కాలేదు. అలాగని మెహ్రీన్ కు అవకాశాల్లేవా అంటే అదేమీ కాదు.

‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ తర్వాత ఒకటి రెండు కాదు.. ఏకంగా అరడజను అవకాశాలందుకుంది మెహ్రీన్. ఐతే అవి పట్టాలెక్కడానికి కొంత ఆలస్యమైంది. ఈ ఏడాది ఒక్కోటిగా సెట్స్ మీదికి వెళ్లాయి. కొన్ని పూర్తయ్యాయి. కొన్ని ముగింపు దశకు వచ్చాయి. మెహ్రీన్ నటించిన ఆ అడరజను సినిమాలు వచ్చే ఆరు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ముందుగా మెహ్రీన్.. శర్వానంద్ సినిమా ‘మహానుభావుడు’తో పలకరించనుంది. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకొస్తుంది. దీని తర్వాత మాస్ రాజా రవితేజ మూవీ ‘రాజా ది గ్రేట్’ విడుదలవుతుంది.

సాయిధరమ్ సరసన మెహ్రీన్ నటించిన ‘జవాన్’ ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అది అక్టోబర్ లో విడుదల కావచ్చు. మరోవైపు మెహ్రీన్ తమిళంలో సందీప్ కిషన్ సరసన నటించిన సినిమా కూడా రెడీ అయింది. ఈ చిత్రం తెలుగులో ‘కేరాఫ్ సూర్య’ పేరుతో అక్టోబర్ లోనే విడుదలవుతుంది. మెహ్రీన్ నటించిన ఇంకో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తొలి సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన మెహ్రీన్.. ఇప్పుడు కొంచెం నాజూగ్గా తయారైంది. వచ్చే రెండు నెలల్లో విడుదలయ్యే మెహ్రీన్ సినిమాల్లో ఒకట్రెండు హిట్టయినా ఆమె దశ మారిపోతుందనడంలో సందేహం లేదు.