Begin typing your search above and press return to search.

ఛాన్సులతో పాటు గ్లామర్ పెరుగుతోందిగా

By:  Tupaki Desk   |   5 Feb 2017 10:30 PM GMT
ఛాన్సులతో పాటు గ్లామర్ పెరుగుతోందిగా
X

టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో మెహ్రీన్ కౌర్ పీర్జాడా స్పీడ్ భలేగా ఉంది. కృష్ణగాడి వీర ప్రేమగాధ ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. రెండు సినిమా రిలీజ్ చేసే లోపే ఏడు ఆఫర్స్ పట్టేసిందంటే.. అమ్మడి స్పీడ్ అర్ధమవుతుంది. ఒకవైపు అవకాశాలు జోరందుకోవడంతో.. మెహ్రీన్ లో గ్లామర్ తో పాటు హాట్ డోస్ కూడా పెరిగిపోతోంది.

యెల్లో కలర్ టాప్ లో డిజైనర్ నెక్ లేస్ తో మెహ్రీన్ ఇచ్చిన హాట్ పోజ్.. ఇప్పుడు కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది. దీనికి తోడు పిక్కలు కనిపించేలా డ్రెసింగ్ చేయడం.. వాలు చూపులతో కనికట్టు చేయడం కూడా బాగానే ప్రాక్టీస్ చేసినట్లుంది మెహ్రీన్. అందాల విందు మోత మోగించేందుకు రెడీ అని ఇండికేషన్స్ ఇచ్చేయడం.. డ్రస్సుల విషయంలో అబ్జెక్షన్స్ లేవంటూ దర్శక నిర్మాతలకు సిగ్నల్స్ పంపడంతో.. ఇప్పుడీ హాట్ బ్యూటీ క్రేజ్ పీక్ స్టేజ్ లో ఉంది.

రీసెంట్ గా స్టార్ట్ అయిన సాయిధరం తేజ్ మూవీ జవాన్ లో నటిస్తోంది మెహ్రీన్. దీనికి ముందు సందీప్ కిషన్ తో ఓ బైలింగ్యువల్ ను అనౌన్స్ చేసింది. బాలీవుడ్ క్రేజీ మూవీ ఫిలౌరీలో కూడా యాక్ట్ చేసేస్తోంది. ఫిదా.. మిస్టర్ ల తర్వాత వరుణ్ తేజ్ చేయనున్న మూవీలో కూడా ఈ భామే హీరోయిన్. ఇక శర్వానంద్ తో కూడా ఓసినిమాకి సైన్ చేసింది. రవితేజ-అనిల్ రావిపూడిల చిత్రం రాజా ది గ్రేట్ లో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. మరోవైవు అల్లు శిరీష్ తో కూడా ఓ మూవీకి ఒప్పుకుంది. ఇవన్నీ థియేటర్స్ లోకి వచ్చేస్తే.. అమ్మడి రేంజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పడం చాలా కష్టం.