Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఆమేనా?

By:  Tupaki Desk   |   28 April 2017 9:29 AM GMT
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఆమేనా?
X
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి చాలా ఏళ్లుగా చర్చ నడుస్తోంది. ఎట్టకేలకు ఈ ఏడాది ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వచ్చింది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ఐతే ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ ఇచ్చిన తర్వాత మరే అప్ డేట్ లేదు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాలో బిజీ అయిపోతే.. ఎన్టీఆర్ బాబీ మూవీలో పడిపోయాడు. మధ్యలో ఈ ప్రాజెక్టు గురించి కొన్ని రూమర్లు వినిపించడం.. చిత్ర వర్గాల నుంచి ఖండన రావడం తెలిసిందే. అంతకుమించి కొత్త సమాచారం ఏదీ లేదు. ఐతే కొత్తగా వినిపిస్తున్న కబురేంటంటే.. ఈ చిత్రానికి హీరోయిన్ ఫైనలైజ్ అయిపోయిందట.

‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు పట్టేసిన మెహ్రీన్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఇటీవలే మెహ్రీన్ రెండు క్రేజీ ఆఫర్లను వదులుకున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందుకు కారణాలేంటన్నది మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. ఐతే త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఓకే అవడంతోనే ఆమె డేట్లు సర్దుబాటు చేయలేక ఆ ప్రాజెక్టుల్ని వదులుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్.. సాయిధరమ్ తేజ్ సరసన ‘జవాన్’తో పాటు రవితేజ సినిమాలోనూ కథానాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా నిజంగానే ఓకే అయి ఉంటే.. మెహ్రీన్ కెరీర్ మరో దశకు చేరబోతున్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/