Begin typing your search above and press return to search.

మెహ్రీన్ ముద్దుగానే ఉంది.. కానీ..

By:  Tupaki Desk   |   30 Sep 2017 6:53 AM GMT
మెహ్రీన్ ముద్దుగానే ఉంది.. కానీ..
X
గతేడాది కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంలో నానితో కలిసి సందడి చేసిన హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పీర్జాడా. అందంగా ఉండడం.. ఆడియన్స్ ను ఆకట్టుకోవడం.. అన్నిటికి మించి అరంగేట్రంలోనే హిట్ పడ్డంతో అవకాశాలు వచ్చాయ్ కానీ.. ఇప్పుడు మహానుభావుడు వరకూ ఈ భామ నటించిన నటించిన మరో సినిమా విడుదల కాలేదు. హిందీలో ఫిలౌరీ అంటూ ఓ మూవీని తెచ్చినా.. అది తెలుగు ఆడియన్స్ కు చేరువ కాలేదు.

మహానుభావుడు మూవీలో సిటీలో ఉద్యోగం చేసే పల్లెటూరి అమ్మాయి పాత్రలో బాగానే ఒదిగిపోయింది మెహ్రీన్ కౌర్. మొదటి సినిమాలో బొద్దుగా ఉందనే మాటలు వినిపించడంతో.. ఆ విషయంలోనూ బరువు తగ్గి కాస్త స్లిమ్ గా మారింది. 5 కిలోలు బరువు తగ్గాను తెలుసా అంటూ.. సినిమాలోనే సిట్యుయేషన్ ప్రకారం ఈ విషయాన్ని చెప్పింది కూడా. ఇటు గ్లామర్ లోను.. ట్రాన్స్ పరెంట్ డ్రెస్సుల్లో క్లీవేజ్ చూపించడంలోనూ ట్యాలెంట్ బాగానే చూపించిన మెహ్రీన్.. యాక్టింగ్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ముద్దుముద్దుగా పలికించేందుకు ప్రయత్నించిన కొన్ని డైలాగ్స్ కు కనీసం లిప్ సింక్ కూడా చేయలేకపోయింది.

ఇక పల్లెటూరి సన్నివేశాల్లో అయితే.. కట్టుబొట్టు మినహాయిస్తే.. మెహ్రీన్ నడత ఏ మాత్రం విలేజర్ లా అనిపించలేకపోయింది. తొలి చిత్రంలో కూడా పల్లెటూరి భామగానే కనిపించిన ఈమె.. రెండో సినిమాలో కూడా అలాంటి అవకాశమే వచ్చినా.. మెప్పించలేకపోవడం ఆశ్చర్యకరమే. అందం.. ఆకర్షణతో పాటు.. ఆయా పాత్రల్లో ఒదిగిపోగలిగే ప్రతిభ కూడా పెంచుకుంటే.. మెహ్రీన్ కు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చేసేందుకు బోలెడన్ని ఛాన్సులున్నాయి. ప్రస్తుతం సాయిధరం తేజ్ తో జవాన్ .. రవితేజతో రాజా ది గ్రేట్.. సందీప్ కిషన్ తో కేరాఫ్ సూర్య(బైలింగ్యువల్) చిత్రాల్లో నటిస్తోంది మెహ్రీన్ కౌర్ పీర్జాడా.