Begin typing your search above and press return to search.

మెహ్రీన్ స్టామినా ఇప్పుడైనా తెలుస్తుందా?

By:  Tupaki Desk   |   28 Nov 2017 5:30 PM GMT
మెహ్రీన్ స్టామినా ఇప్పుడైనా తెలుస్తుందా?
X
ముట్టుకుంటే కందిపోయేలా ఉండే మెహ్రీన్ పిర్జాద గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మడు ఎమోషన్స్ సీన్స్ చేసిందంటే చాలు బుగ్గలు చాలా వరకు ఎరుపెక్కిపోతాయి. కాని ఆమె ముఖంలో హావభావాలు మాత్రం అస్సలు పలకవ్. ప్రస్తుతం టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ బండి మంచి సక్సెస్ రేజ్ లో దూసుకుపోతోంది. కాకపోతే ఒక్క సినిమాలో కూడా ఈమె సూపర్ అనే మాటను ఒక్క ఫిలిం క్రిటిక్ కూడా చెప్పిన పాపాన పోలేదు.

గత ఏడాది కృష్ణ గాడి ప్రేమగాధ సినిమాతో అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో వరుసపెట్టి అవకాశాలను దక్కించేసింది. ఏడాదిపాటి ఆ సినిమా షూటింగ్ లతో బిజీగా గడిపి ఫైనల్ గా మహానుభావుడు అంటూ వార్ స్టార్ చేసింది. ఆ సినిమాకు టాక్ బాగానే వచ్చింది కాని మెహ్రీన్ గురించి ఏమీ విన్లేదు. ఆ తర్వాత రాజా ది గ్రేట్ కూడా మంచి సక్సెస్ అయ్యింది. కాని మెహ్రీన్ తేలిపోయింది. ఇక కేరాఫ్ సూర్యా లో అయితే దర్శకుడు అమ్మడి సీన్స్ సినిమా రిలీజ్ తరువాత తీసేయడం కొంచెం హాట్ టాపిక్ అయ్యింది.

సాధారణంగా కాజల్ - సమంత అలాగే రకుల్ వంటీ హీరోయిన్స్ రెండు హిట్స్ అందుకోగానే స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంటున్నారు. కానీ మెహ్రీన్ మాత్రం ఇంకా ఆ మీడియం స్టేజ్ సినిమాలనే చేస్తోంది. దానికి కారణం ఈమె యాక్టింగ్ తో ఏమాత్రం ప్రూవ్ చేసుకోకపోవడమే. ఇక డిసెంబర్ 1న ఆమె నటించిన జవాన్ సినిమా రిలీజ్ కానుంది. మరి ఆ సినిమాతో ఏమైనా ప్రూవ్ చేసుకుంటే.. సీన్ మారుతుంది.. లేదంటే తాప్సీ తరహాలో తెలుగు ఇండస్ట్రీ నుంచి జంప్ అయిపోవాల్సి రావచ్చు.