Begin typing your search above and press return to search.

మెహరిన్ కి హ్యట్రిక్ ఖాయమేనా!

By:  Tupaki Desk   |   8 Oct 2017 11:32 AM GMT
మెహరిన్ కి హ్యట్రిక్ ఖాయమేనా!
X
కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది భామ మెహరిన్. అయితే ఈ బ్యూటీకి తొలిసినిమాతో హిట్ వచ్చినా అవకాశాలు రావడానికి మాత్రం చాలా టైమ్ పట్టింది. కృష్ణగాడి వీర ప్రేమగాథ విడుదలైన ఏడాదిన్నర తరువాత మెహరిన్ కి మళ్లీ టాలీవుడ్ లో ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ఈ లోపు మెహరిన్ ఫిలౌరీ అనే ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటించి - హిందీలో కూడా తన లక్ టెస్ట్ చేసుకుంది. అయితే బాలీవుడ్ లో మరో అవకాశం వచ్చే లోపే టాలీవుడ్ నుంచి మెహరిన్ కి అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.

మహానుభావుడు మొదలుకొని జవాన్ - కెరాఫ్ సూర్య - రాజా ది గ్రేట్ ఇలా క్రేజీ సినిమాలతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన మహానుభావుడులో మెహరిన్ అభినయానికి విమర్శకులు మంచి మార్కులే వేసారు. ఇక దీపావళి కానుకగా విడుదల కాబోతున్న రాజా ది గ్రేట్ లో మాస్ రాజా రవితేజ సరసన నటిస్తోంది మెహరిన్. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే రాజా ది గ్రేట్ లో మెహరిన్ నటనతో పాటు గ్లామర్ డోస్ కూడా కాస్త పెంచినట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమా కూడా సక్సెస్ అందుకుంటే మెహరిన్ కి హ్యాట్రిక్ వచ్చినట్లే అని సినీజనాలు అంటున్నారు. అంతేకాదు కాజల్ - సమంత - తమన్నా - రకుల్ జోరు తగ్గడంతో వారిని మెహరిన్ రీప్లేస్ చేస్తుందనే టాక్ నడస్తోంది. మరి జోరుమీదున్న ఈ బబ్లీ బ్యూటీ కెరీర్ రానున్న రోజుల్లో ఎలాంటి మలుపుతు తిరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.