Begin typing your search above and press return to search.

ఒకేసారి నాలుగు సినిమాలతో వస్తోంది

By:  Tupaki Desk   |   3 Sep 2017 6:34 AM GMT
ఒకేసారి నాలుగు సినిమాలతో వస్తోంది
X
ప్రస్తుత రోజుల్లో చాలా మంది హీరోయిన్లు ఎక్కువ కాలం ఉండడం లేదు. కానీ ఉన్నన్ని రోజులు హిట్ సినిమాలతో అలరిస్తూ వారికంటూ ఓ పేరుని తెచ్చుకొని వెళుతున్నారు. ఒక్క హిట్ సినిమా పడిందంటే చాలు ఇక గ్యాప్ లేకుండా ఇతర హీరోయిన్లకు పోటీని ఇస్తూ.. దూసుకుపోతున్నారు. ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ లో దూసుకుపోతోంది మెహ్రీన్ పీర్జాదా.

గత ఏడాది నానితో "కృష్ణ గాడి వీర ప్రేమ గాద" అనే హిట్ ను అందుకున్న ఈ భామ ఇప్పటివరకు ఒక్క సినిమాను రిలీజ్ చెయ్యలేదు. హిందీలో మాత్రం అనుష్క శర్మ - ఫీలౌరి సినిమాలో స్పెషల్ పాత్రలో అలరించింది. కానీ తెలుగులో మాత్రం ఇంకా షూటింగ్ లలో బిజీగా వుంది. అయితే ఈ రెండు నెలల్లో ఈ అమ్మడు హవా మాములుగా ఉండదట. ప్రస్తుత రోజుల్లో ఏ హీరోయిన్ కి సాధ్యం కాని ఫీట్ ని మెహ్రీన్ సొంతం చేసుకోబోతోందని ఆమె పిఆర్ హడావుడి చేస్తోంది. ఎందుకంటే ఈ రెండు నెలల కాలంలో మెహ్రీన్ ఏకంగా నాలుగు కొత్త రిలీజ్ లలో కనిపిస్తోంది. శర్వానంద్-మహానుభావుడు మరియు రవితేజ - రాజా ది గ్రేట్ సినిమాలతో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ - జవాన్ సినిమా లో కూడా నటిస్తోంది. అలాగే మరో యువ హీరో సందీప్ కిషన్ తెరకెక్కిస్తున్న రెండు సినిమాల్లో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

దాదాపు ఈ సినిమాలన్నీ ఈ రెండు నెలల వ్యవధిలోనే రిలీజ్ కానున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె ప్రస్తుతం నటిస్తున్న హీరోలందరు ఫ్లాప్స్ లో ఉన్నవారే. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని తెగ కష్టపడుతున్నారు. వీళ్లలో ఒక్కరైనా హిట్టు కొట్టి మెహ్రీన్ ను హిట్ హీరోయిన్ అని అనిపిస్తారా. లేకపోతే ఈమె మరో తాప్సీ అయిపోయే ఛాన్సుంది.