Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత సినిమాలు ఆపేయను: యంగ్ హీరోయిన్

By:  Tupaki Desk   |   31 March 2021 1:30 AM GMT
పెళ్లి తర్వాత సినిమాలు ఆపేయను: యంగ్ హీరోయిన్
X
టాలీవుడ్ యువనటి మెహరీన్ కౌర్.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ మూవీ 'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో అడుగుపెట్టిన ఆ సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్టార్టింగ్ సినిమాల్లో చబ్బీ లుక్స్ తో లంగావోణీలో అదరగొట్టిన మెహరీన్.. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో మోడరన్ దుస్తులు ధరించి గ్లామర్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ లో మంచి హిట్స్ పడ్డాయి కానీ ప్రస్తుతం కెరీర్ పరంగా చాలా స్లో అయింది అమ్మడు. రెండు మూడేళ్లు బిజీగానే ఉంది. ఈమధ్యే అసలు కనిపించడం లేదు. గతేడాది 'ఎంతమంచివాడవురా' అనేది మెహరీన్ లాస్ట్ మూవీ. భారీ గ్యాప్ తర్వాత తెలుగులో ఎఫ్3 మూవీ చేస్తోంది.

అయితే కొంతకాలంగా మెహ్రీన్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. హర్యానాకు చెందిన యంగ్ పొలిటికల్ లీడర్ భవ్య బిష్ణోయిని మెహరీన్ పెళ్లి చేసుకోబోతుంది. ఈ వచ్చే శీతాకాలం రెండు కుటుంబాల సమక్షంలో పెళ్లికి ఏర్పాట్లు మొదలు పెడతారట. ఇటీవలే ఈ జంట మార్చి 13న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు షేర్ చేసుకుంది మెహరీన్. 'భవ్యలాంటి అర్ధం చేసుకునేవాడు, సపోర్ట్ చేసేవాడు దొరకడం తన అదృష్టంగా చెబుతోంది. అలాగే పెళ్లి కూడా అటు పంజాబీ పద్ధతిలో ఇటు హిందూ సంప్రదాయంలోను చేసుకోనున్నట్లు తెలిపింది. చివరిగా సినిమా లైఫ్ గురించి స్పందించి.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని.. నా భర్త అందుకు నిరాకరించలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త తెలిసి మెహరీన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.