Begin typing your search above and press return to search.

#ఎఫ్ 3.. హ‌నీ గంపెడాశ‌లు ఆయ‌న‌పైనే..!

By:  Tupaki Desk   |   22 Dec 2020 3:30 PM GMT
#ఎఫ్ 3.. హ‌నీ గంపెడాశ‌లు ఆయ‌న‌పైనే..!
X
ఒక హిట్టివ్వ‌డం అటుపై ఫ్లాప్ తో వెన‌క‌డుగు వేయ‌‌డం ఇదీ మెహ్రీన్ వ‌రుస. విజ‌యంతో ఒక మెట్టు ఎక్కితే ప‌రాజ‌యంతో నాలుగు మెట్లు దిగ‌డం ఈ యంగ్ బ్యూటీ దుర‌దృష్టం. అందుకేనేమో ఈ అమ్మ‌డిని ఇన్నాళ్లు స‌రైన‌ స్టార్ డ‌మ్ వ‌రించ‌లేదు. ఇప్ప‌టికీ కెరీర్ సందిగ్ధంలోనే ఉంది. ప్ర‌తిసారీ హిట్టిచ్చాక వ‌రుస‌ చిత్రాల‌కు సంత‌కాలు చేసినా ఏవీ వ‌ర్క‌వుట్ కావు. ఇంత‌కుముందు F2 తరువాత కూడా ఇదే జ‌రిగింది.

అశ్వత్థామ‌ విడుదల‌య్యాక స‌రైన ఆఫ‌ర్లు లేవ్.. విడుదల లేదు. ఎఫ్ 3 తప్ప వేరే చిత్రం లేదు. మరోసారి త‌న‌కు బిగ్ హిట్టిస్తాడ‌ని ఎఫ్ 2 ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడిపూనే గంపెడాశలు పెట్టుకుంది.

హనీ పాత్ర త‌న‌కు మంచి పేరు తెచ్చింది. ఎఫ్ 2 లో హ‌బ్బీపై మండిప‌డే కోపిష్టి హ‌నీగా బాగానే న‌టించి మెప్పించింది. రొమాంటిక్ శ్రీ‌మ‌తిగా వ‌రుణ్ కి స‌రిజోడు అనిపించింది అమ్మ‌డు. అనీల్ రావిపూడి త‌న‌ను ఎఫ్ 3 లో ఎలా చూపిస్తారు అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతానికి ఈ సినిమా త‌ప్ప వేరే ఏ చిత్రానికి సంతకం చేయలేదు. ఉన్న‌ట్టుండి బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫైనల్ లో త‌న ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడితో పాటు వేదిక‌పై కనిపించింది. అలాగే ఎఫ్ 3 లో స్పెష‌ల్ ట్రీటివ్వాల‌న్న పంతాన్ని కూడా క‌న‌బ‌రుస్తోంది మెహ్రీన్. అందుకోసం చాలా బరువు కోల్పోయి కొత్త అవతారంలో స్పెష‌ల్ గా కనిపిస్తోంది. ఒక మంచి బ్రేక్ కోస‌మే ఈ త‌ప‌న అని భావించాల్సి ఉంటుంది.