Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : మాల్దీవ్స్ లో మంటలు రేపుతున్న అందగత్తె..!

By:  Tupaki Desk   |   8 Nov 2022 3:58 AM GMT
ఫోటో స్టోరీ : మాల్దీవ్స్ లో మంటలు రేపుతున్న అందగత్తె..!
X
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే తమకు దొరికిన కొద్దిపాటి టైం ని కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు మన తారామణులు. కెరియర్ జోష్ ఉన్నా లేకున్నా ఎంజాయ్ మెంట్ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. వారిలో మెహ్రీన్ కూడా ఒకరు. F3 తర్వాత చేతిలో సినిమాలు ఏమి లేకపోయినా సరే అదేమి పట్టనట్టుగా లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది అమ్మడు. న్యాచురల్ స్టార్ నాని కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెరంగేట్రం చేసిన మెహ్రీన్ ఆ సినిమాతో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది.

ఇక శర్వానంద్ తో మహానుభావుడు, రవితేజతో రాజా ది గ్రేట్ సినిమాల్లో నటించి హిట్ అందుకుంది. ఆ తర్వాత కెరియర్ లో ఫుల్ జోరు కొనసాగిస్తున్న అమ్మడికి వరుస ఫ్లాపులు పలుకరించాయి. ఈ ఐదేళ్లలో మెహ్రీన్ నటించిన సినిమాలు పదుల సంఖ్యలో ఉండగా హిట్ అయినవి మాత్రం F2, F3 మాత్రమే.

వరుస ఫ్లాపులతో ఒకానొక దశలో పెళ్లికి ఫిక్స్ అయింది మెహ్రీన్. ఓ సీఎం కొడుకుతో ఎంగేజ్ మెంట్ కూడా జరుపుకుంది. కానీ త్రిష తరహాలో ఎంగేజ్ మెంట్ తర్వాత అమ్మడు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. దానికి కారణాలు ఏంటన్నది ఇప్పటివరకు తెలియలేదు.

మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్న మెహ్రీన్ కి ఒకటి రెండు అవకాశాలు వచ్చి హడావిడి చేసినా ఇప్పుడు మళ్లీ చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. అయితే లేటెస్ట్ గా అమ్మడు మాల్దీవ్స్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ తన గ్లామర్ షోతో ఆడియన్స్ కి అందాల కిక్ ఇస్తుంది అమ్మడు. మెహ్రీన్ మాల్దీవ్స్ మంటలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. గ్లామర్ విషయంలో కొద్ది కొద్దిగా పొదుపు చేస్తూ వస్తున్న మెహ్రీన్ ఇక మీదట ఎలాంటి సినిమాలకైనా రెడీ అని హింట్ ఇస్తుంది.

హీరోయిన్ గా ఓ పక్క సినిమాల్లో చేస్తూనే ఇక మీదట స్పెషల్ సాంగ్స్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యింది. అందుకే తనలోని ఉన్న సంపదలన్నిటినీ బయట పెట్టి ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది అమ్మడు.

ప్రస్తుతం కన్నడ శివ రాజ్ కుమార్ చేస్తున్న నీ సిగువరెగు సినిమాలో నటిస్తుంది మెహ్రీన్. కన్నడలో అయినా అమ్మడు ఈ సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి. లేటెస్ట్ గా మాల్దీవ్స్ ఫోటొలతో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని సర్ ప్రైజ్ చేసింది మెహ్రీన్ కౌర్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.