Begin typing your search above and press return to search.

టాలీవుడ్లో మెహ్రీన్ క్రష్ ఎవరంటే..

By:  Tupaki Desk   |   26 Nov 2017 5:38 AM GMT
టాలీవుడ్లో మెహ్రీన్ క్రష్ ఎవరంటే..
X
మెహ్రీన్.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్. గత ఏడాది ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి హిట్ మూవీతో కథానాయికగా పరిచయమైన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది స్వల్ప విరామంలో ‘మహానుభావుడు’.. ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో హిట్లు కొట్టి హ్యాట్రిక్ పూర్తి చేసింది. గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్లో మీ క్రష్ ఎవరు అని అడిగితే.. ఆసక్తికర సమాధానం చెప్పింది మెహ్రీన్. ఆమె ఇచ్చిన సమాధానమేంటో తన మాటల్లోనే తెలుసుకుందా పదండి.

‘‘నాకు హీరోల మీద కాదు.. ఓ హీరోయిన్ మీద క్రష్ ఉంది. ఆమే.. అనుష్క శెట్టి. నేను ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచి ఆమెను అభిమానిస్తున్నాను. ఆమె సినిమాలు దాదాపుగా ప్రతి ఒక్కటీ చూశాను. తనంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆమె తన పాత్రల్ని పోషించే విధానం నాకు చాలా ఇష్టం. ఎంతో ఎదిగినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు. నేను ‘యువి క్రియేషన్స్’ బేనర్లో ‘మహానుభావుడు’లో నటిస్తున్నపుడు అనుష్క గురించే మాట్టాడుతుండేదాన్ని. ఆ సినిమా స్పెషల్ షోకు అనుష్క గారు వస్తున్నారంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆమె పక్కనే కూర్చుని సినిమా చూశాను. ఆ అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. నేను అభిమానించే నటి నుంచి ప్రశంసలు అందుకోవడం నాకు గొప్ప అనుభూతి. ఆమెతో ఆ సందర్భంగా చాలాసేపు మాట్లాడాను. అంత పెద్ద స్టార్ అయి ఉండి నాతో చాలా మామూలుగా ఉన్నారు’’ అని మెహ్రీన్ చెప్పింది.