Begin typing your search above and press return to search.

మెహ్రీన్ హాట్ సెల్ఫీస్ చూశారా

By:  Tupaki Desk   |   4 July 2018 7:03 AM GMT
మెహ్రీన్ హాట్ సెల్ఫీస్ చూశారా
X
కృష్ణగాడి వీర ప్రేమగధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ మెహ్రీన్ పిర్జాద. వరుస విజయాలతో గత ఏడాది కొంచెం హంగామా చేసిన ఈ హాట్ బ్యూటీ మళ్ళీ అదే ఏడాది భారీ ఫెయిల్యూర్స్ తో షాక్ ఇచ్చింది. నటనలో కూడా ఇంకా మార్పులు రావాలని కామెంట్స్ చాలా వచ్చాయి. అందం గురించి కూడా కాస్త పట్టించుకుంటే మంచిది.. మరి బొద్దుగా అవుతున్నావ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.

దీంతో అమ్మడు కాస్త ఆ విషయాల గురించి ఇటీవల ఎక్కువ ద్రుష్టి పెట్టింది. చాలా రోజుల తరువాత పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఆ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఓ వైపు చిత్ర కథానాయకుడు గోపీచంద్ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ తో ప్రమోషన్స్ పెంచుతుంటే అమ్మడు మాత్రం డుమ్మా కొట్టేస్తోంది. రీసెంట్ గా జరిగిన ఈవెంట్ కి రమ్మని అంటే తనకు బాగా ఫీవర్ ఉందంటూ చెప్పిందట.

దీంతో చిత్ర యూనిట్ కూడా ఏమనలేదట. అయితే అమ్మడు సెల్ఫీలు మాత్రం తెగ దిగేస్తోంది. సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో హాట్ సెల్ఫీలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనసైడ్ నుంచి ప్రమోషన్స్ చేస్తోంది. మరి ఈ సినిమాతో అయినా అమ్మడు సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.