Begin typing your search above and press return to search.

మెహ్రీన్ కు మండిపోయింది

By:  Tupaki Desk   |   3 July 2018 4:20 AM GMT
మెహ్రీన్ కు మండిపోయింది
X
కొత్త హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నాలుగైదు సినిమాల్లో నటిస్తే చాలు.. సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తోంది. అసలే అందమైన అమ్మాయిలు కావడం.. అందునా హీరోయిన్లు కావడంతో వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. కానీ ఫాలోయర్లు అందరూ ఒకేలా ఉండరు కదా. కొందరు తమ కామెంట్లతో కోపం తెప్పించేస్తుంటారు. పంజాబీ భామ మెహ్రీన్ కు ఈమధ్యనే ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.

రీసెంట్ గా మెహ్రీన్ సరదాగా సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఓ వ్యక్తి దాన్నంతటినీ వీడియో తీశాడు. మెహ్రీన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి పని చేస్తూ దొరికిపోయా (కాట్ ఇన్ ది యాక్ట్) అన్న అర్ధం వచ్చేలా టైటిల్ పెట్టి పోస్టింగ్ పెట్టింది. ఇది చూసి నెటిజన్ కు చిర్రెత్తుకొచ్చింది. ‘‘సోషల్ మీడియాలో ఇటువంటి వీడీయోలు పెట్టడానికి కాస్తయినా సిగ్గుపడాలి’’ అంటూ తన కోపమంతా చూపిస్తూ పోస్టింగ్ పెట్టాడు. ఈ కామెంట్ చూడగానే మెహ్రీన్ కు పిచ్చి కోపమొచ్చేసింది. ‘‘ఇలాంటి డర్టీ ఆలోచన చేస్తున్నందుకు నువ్వు సిగ్గుపడాలి’’ అంటూ రిప్లయ్ ఇచ్చింది.

మహానుభావుడు సినిమా తరవాత మెహ్రీన్ కు హిట్ అన్నదే కరువైపోయింది. వరస ఎదురుదెబ్బల తరవాత ప్రస్తుతం గోపీచంద్ సినిమా పంతం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తనకు బ్రేక్ ఇస్తుందని ఈ భామ ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తోంది. జులై 5న ఈ మూవీ థియేటర్లకు రానుంది.