Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: కొండ‌చిలువ క‌న్య‌క‌

By:  Tupaki Desk   |   10 Sep 2018 12:15 PM GMT
ఫోటో స్టోరీ: కొండ‌చిలువ క‌న్య‌క‌
X
కొండ‌చిలువ‌ను మెడ‌లో వేసుకుని ఆటాడించాలంటే ఎన్ని గ‌ట్స్ ఉండాలి? అలాంటి గ‌ట్స్ ఒకే ఒక్క అమ్మ‌డికి ఉండేవి. బాలీవుడ్ సెక్సీ గాళ్‌ - మ‌ర్డ‌ర్ ఫేం మ‌ల్లిక శ‌రావ‌త్ అప్ప‌ట్లో కొండ చిలువ‌ను మెడ‌లో వేసుకుని ఫ్యాన్స్‌ కి ట్రీట్ ఇచ్చింది. మ‌ల్లిక డేరింగ్ ఫీట్ చూసి ఔరా! అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఆ త‌ర్వాత స‌ర్ప‌క‌న్య‌గానూ మ‌ల్లిక న‌టించి మెప్పించింది.

ఇదిగో ఇప్పుడు మెహ్రీన్‌ని చూస్తున్నా మ‌ల్లిక గుర్తొస్తోంది. ఆవిడ‌లోని డేర్ ఈవిడ‌కు పాకిందా? ఎంత ధైర్యం మెహ్రీన్‌ కి? కొండ జంతువుల్ని - జింక‌ల్ని మింగేసే కొండ‌చిలువ‌నే ఇలా మెడ‌లో వేసుకుంటుందా? అస‌లు భ‌యం అన్న‌దే లేదా? అంటూ అభిమానుల‌కు బోలెడ‌న్ని సందేహాలు. అందుకే ఓ అభిమాని .. అది నిజ‌మైన కొండ‌చిలువేనా మ్యాడ‌మ్‌? అంటూ బిత్త‌ర పోయి ప్ర‌శ్నించాడు. కొంపదీసి ర‌బ్బరు కొండ‌చిలువా? అని ఒక గ‌డుగ్గాయ్ ప్ర‌శ్న సంధించాడు. దీనిని సమాధానంగా అవును అది నిజ‌మైన పైథాన్ అంటూ స‌మాధానం వ‌చ్చింది.

ఓహ్ బ్రేవ్ గాళ్ అంటూ ఒక‌డు - సూప‌ర్ మ్యాడ‌మ్ అంటూ ఇంకొక‌డు - బ్యూటిఫుల్ పైథాన్ అంటూ వేరొక అభిమాని రీట్వీట్లు చేశారు. యాక్ .. దేవుడా! అంటూ ..ఇంకొక‌రు కామెంట్ పోస్ట్ చేశారు. మొత్తానికి `ఎఫ్ 2-ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌` సెట్స్‌లో మెహ్రీన్ మా బాగానే ఎంజాయ్ చేస్తోంది. వ‌రుణ్‌ తేజ్‌ తో క‌లిసి ఇంత చిద్విలాసంగా ఆస్వాధిస్తోంద‌న్న‌మాట‌. వ్వాటే ఫ‌న్నీ మెహ్రీన్... యూ నాటీ!!