Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ భామ ఏం మెరుస్తోందిలే

By:  Tupaki Desk   |   12 April 2017 11:12 AM GMT
ట్రెండింగ్ భామ ఏం మెరుస్తోందిలే
X
టాలీవుడ్ లో సీనియర్ స్టార్స్ కంటే కుర్ర భామల స్పీడే ఎక్కువగా ఉంది. ఒకరిని మించి మరొకరు దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో కుదురుకున్న సుందరాంగులతో పాటు కొత్త వయ్యారి భామలు కూడా.. ఛాన్స్ దొరికితే చాలు ట్యాలెంట్ చూపించేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీస్ లో మెహ్రీన్ కౌర్ పీర్జాడా పేరు కూడా చెప్పుకోవాలి.

కృష్ణగాడి వీర ప్రేమగాధతో పరిచయమైన ఈ భామ.. వరుసగా ఆఫర్స్ పట్టేస్తూ అందరికీ షాక్ ఇచ్చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ మూవీ ఫిలౌరీలో కూడా నటించేయగా.. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా జరిగిన జీ అప్సర అవార్డ్స్ లో మెహ్రీన్ ఈ రేంజ్ లో రెడీ అయిపోయి డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చేసింది. సాంప్రదాయంగా కనిపిస్తూనే.. క్లీవేజ్ అందాలను.. నడుము కొలతలను ఎగ్జిబిట్ చేస్తూ.. నాభి సొగసులను కూడా ప్రదర్శనకు పెట్టింది.

అమ్మడి అందానికి మోడర్న్ ట్రెండ్ ఆభరణాలు మరింతగా శోభను చేకూర్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. రవితేజతో రాజా ది గ్రేట్.. సాయి ధరం తేజ్ తో జవాన్.. నితిన్ తో ఓ మూవీ.. తమిళంలో మరో చిత్రం చేసేస్తూ.. యంగ్ బ్యూటీస్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/